
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. సోమవారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే తాజ్ కృష్ణకు చేరుకున్నారు. ఈ రోజు రాత్రి 9 గంటలకు సీఎల్పీ సమావేశం గచ్చిబౌలి ఎల్పీ హోటల్లో జరగనుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.