రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

మాండూస్ తుఫాను ఎఫెక్ట్ తో రాష్ట్రంలో ముసురు వాతావరణం ఉంది. మరో 12 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏపీలోని రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరికి ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

తెలంగాణపై మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్ కొనసాగుతోంది. ఈనెల 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. దక్షిణ తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. చల్లని గాలులు వీస్తున్నాయి. ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్తున్నారు.