
దుబాయ్: ఆసియా కప్‌లో ఫైనల్బెర్త్ను ఖాయం చేసుకున్న టీమిండియా సూపర్–4లో ఆఖరి మ్యాచ్‌కు రెడీ అయ్యింది. శుక్రవారం జరిగే ఈ పోరులో శ్రీలంకపై గెలిచి ఫైనల్‌కు ముందు టీమ్‌ను మరోసారి చూసుకోవాలని భావిస్తోంది. అయితే సంజూ శాంసన్మిడిలార్డర్కు సెట్‌కాకపోవడం ఆందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో జితేష్‌శర్మకు చాన్స్‌ఇస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది. ఫినిషర్‌గా అతని సేవలను ఉపయోగించుకోవాలని మేనేజ్‌మెంట్‌యోచిస్తోంది. ఐదో ప్లేస్‌లో 18 మ్యాచ్‌లు ఆడిన జితేష్ 147.8 స్ట్రయిక్ రేట్‌తో 374 రన్స్ చేశాడు. ఆరో ప్లేస్‌లోనూ 15 ఇన్నింగ్స్‌ల్లో 384 రన్స్ సాధించాడు.
కాబట్టి జితేష్‌ను ఆడించే అంశంపై గౌతీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఇక లెఫ్ట్–-రైట్‌కాంబినేషన్ కోసం శాంసన్ ప్లేస్‌ను పదేపదే మార్చడం అతని బ్యాటింగ్‌ను దెబ్బతీస్తోంది. ఈ టోర్నీలో ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌కు తిరుగులేకపోయినా.. ఫీల్డింగ్‌వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇండియన్‌ఫీల్డర్లు 10 క్యాచ్‌లను డ్రాప్‌చేశారు. ప్రస్తుతానికి ఇండియా బౌలింగ్‌లో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. మరోవైపు ఇప్పటికే ఫైనల్‌కు దూరమైన శ్రీలంక.. విజయంతో టోర్నీని ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బౌలర్లు సమయోచితంగా రాణిస్తేనే ఇండియాను అడ్డుకోవడం సాధ్యమవుతుంది. లేదంటే ఖాతాలో మరో ఓటమి తప్పదు.