సన్‌రైజర్స్‌ జోరు కొనసాగేనా!

సన్‌రైజర్స్‌ జోరు కొనసాగేనా!

దుబాయ్‌‌: లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌పై సాధించిన వన్‌‌సైడ్‌‌ విక్టరీతో ఫుల్‌‌ జోష్‌‌లో ఉన్న సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ ఐపీఎల్‌‌–13లో మరో పోరుకు రెడీ అయ్యింది. వరుసగా  రెండు ఓటములతో కష్టాల్లో ఉన్న చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌తో శుక్రవారం అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటిదాకా లీగ్‌‌లో మూడు మ్యాచ్‌‌లు ఆడిన ఇరుజట్లు చెరో ఒక విజయం మాత్రమే సాధించాయి. కానీ బ్యాటింగ్‌‌ లైనప్‌‌ విషయంలో సీఎస్‌‌కే పలు సమస్యలు ఎదుర్కొంటోంది. దీంతో ఈ మ్యాచ్‌‌లో సన్‌‌రైజర్సే ఫేవరెట్‌‌గా బరిలోకి దిగనుంది. హైదరాబాద్‌‌కు బ్యాటింగ్‌‌లో పెద్దగా సమస్యలు లేవు. కెప్టెన్‌‌ డేవిడ్‌‌ వార్నర్‌‌, బెయిర్‌‌స్టో, విలియమ్సన్‌‌, మనీశ్‌‌ పాండే మంచి టచ్‌‌లో ఉన్నారు. ముఖ్యంగా విలియమ్సన్‌‌ తుది జట్టులోకి రావడంతో సన్‌‌రైజర్స్‌‌ మిడిలార్డర్‌‌ బలంగా తయారైంది. ఢిల్లీ మ్యాచ్‌‌లో ఇది ప్రూవ్‌‌ అయ్యింది. అయితే వార్నర్‌‌ నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్‌‌ ఆశిస్తోంది. బౌలింగ్‌‌లోనూ సన్‌‌ రైజర్స్‌‌ పటిష్టంగానే ఉంది. ముఖ్యంగా భువనేశ్వర్‌‌ కుమార్‌‌, రషీద్‌‌ ఖాన్‌‌ గాడిలో పడడంతో జట్టులో మునుపటి కాన్ఫిడెన్స్‌‌ తిరిగి వచ్చింది. ఢిల్లీ మ్యాచ్‌‌లో యార్కర్లతో ఆకట్టుకున్న నటరాజన్‌‌ మరోసారి కీలకం కానున్నాడు. మరోపక్క ధోనీ అండ్‌‌ టీమ్‌‌ బ్యాటింగ్‌‌ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నది.  అయితే ముంబైపై విజయంలో కీ రోల్‌‌ పోషించిన అంబటి రాయుడు ఈ మ్యాచ్‌‌లో బరిలోకి దిగడం ఖాయమైంది. అతనితోపాటు ఆల్‌‌రౌండర్‌‌ డ్వేన్‌‌ బ్రావో కూడా రానున్నాడు. మురళీ విజయ్‌‌ ప్లేస్‌‌లో రాయుడు టీమ్‌‌లోకి రావడమే కాకుండా షేన్‌‌ వాట్సన్‌‌తో కలిసి ఇన్నింగ్స్‌‌ మొదలుపెట్టనున్నాడు.  అయితే  బ్రావో కోసం ఎవరిని పక్కనపెడతారనేది ఆసక్తికరంగా ఉంది. దుబాయ్‌‌లో వికెట్‌‌ ప్రకారం పేలవ ఫామ్‌‌లో ఉన్నప్పటికీ కేదార్‌‌ జాదవ్‌‌కు మరో చాన్స్‌‌ దొరకడం ఖాయంగా ఉంది. సామ్‌‌ కరన్‌‌ ప్లేస్‌‌ ఖాయం కాగా, బ్రావో కోసం హాజిల్‌‌వుడ్‌‌ను పక్కనపెట్టే చాన్సుంది. ఏదేమైనా చెన్నై బ్యాట్స్‌‌మెన్‌‌ పెర్ఫామెన్స్‌‌పైనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.