అబుదాబి: వరుసగా రెండు ఓటములతో ఐపీఎల్‌ను పేలవంగా ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో సవాల్‌కు రెడీ అయింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రెండు బలమైన జట్లను ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం తలపడనుంది. లీగ్‌లో ఇంకా బోణీ కొట్టని సన్‌రైజర్స్ ఈ పోరుతో అయినా విజయాల బాట పట్టాలని చూస్తోంది. కానీ, అది అనుకున్నంత ఈజీ కాబోదు. ఎందుకంటే పంజాబ్, చెన్నై జట్లపై విక్టరీలతో ఢిల్లీ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. ఓపెనర్ పృథ్వీ షాతో పాటు కెప్టెన్ అయ్యర్, పంత్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో సౌతాఫ్రికా పేస్ ద్వయం కగిసో రబాడ, అన్రిచ్ నోర్జ్ కొత్త బాల్‌తో చెలరేగుతున్నారు. స్పిన్నర్స్ అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా రాణిస్తున్నారు. మరోవైపు కెప్టెన్ వార్నర్ ఫెయిల్యూర్‌కు తోడు, వీక్ మిడ్‌లార్డర్‌తో హైదరాబాద్ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఫస్ట్ మ్యాచ్‌లో జానీ బెయిర్‌స్టో (61), మనీశ్ (34) సత్తా చాటినా ప్రత్యర్థి ముందు 164 రన్స్ టార్గెట్ మాత్రమే ఉంచింది. కోల్‌కతాతో లాస్ట్ మ్యాచ్‌లో బెయిర్‌స్టో ఫెయిలవగా, వార్నర్ ఓ మోస్తరుగానే ఆడాడు. మిడిల్ వైఫల్యంతో మరోసారి చిన్న టార్గెట్ ఉంచగా.. బౌలర్లు దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. రైజర్స్ గెలుపుబాట పట్టాలంటే ఫస్ట్ వార్నర్ ఫామ్‌లోకి రావాలి. మనీశ్, బెయిర్‌స్టో టచ్‌లో ఉన్నా.. ఈ ముగ్గురిని దాటి మిగతా బ్యాట్స్‌మెన్ కూడా రాణిస్తేనే జట్టు బోణీ కొట్టగలదు. ఇంజ్యురీ నుంచి రికవర్ అయిన కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌లో ఆడే చాన్సుంది.
