ఈడీ అధికారిక ప్రకటన ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిజానిజాలు

ఈడీ అధికారిక ప్రకటన ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిజానిజాలు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మార్చి 15న కవిత ఇంట్లో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేసి, కవితను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈడీ అధికారులు ఏడు రోజుల రిమాండ్ లో ఉన్న కవితను విచారణ చేస్తున్నారు. అయితే.. ఈరోజు ఈడీ అధికారులు లిక్కర్ స్కాం గురించి అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. ఈ కేసులో మనీష్ సిసోడియా, సంజయ్  సింగ్, విజయ్ నాయర్ సహా ఇప్పటి వరకు 15మందిని అరెస్ట్ చేసి, రూ.128.79 కోట్లు సీజ్ చేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్ మెంట్ తెలిపింది. 

దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంభై, చెన్నెతో పాటు 245 చోట్ల సోదాలు జరిగాయని ఈడీ వెల్లడించింది. కవిత నివాసంలో రైడ్ జరుగుతున్న సమయంలో ఆమె బంధువులు, సన్నిహితులు ఆటకం కలిగించారని ఈడీ అధికారులు అన్నారు. కవిత ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులతో కలిసి లిక్కర్ పాలసీ అమలు, రూపకల్పనలో అవినీతికి పాల్పడ్డారని వివరించారు. కవిత ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100కోట్లు ఇచ్చిందని ఈడీ అధికారులు ప్రెస్‪నోట్‪లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. కవితను కలిసేందుకు కేటీఆర్, హరీశ్ రావులు ఢిల్లీకి చేరుకున్నారు.

ALSO READ :- బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్