స్థిరంగా పసిడి, వెండి ధరలు..

స్థిరంగా పసిడి, వెండి ధరలు..

దేశంలో 22 క్యారెట్​ బంగారం ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి ధర రూ. 54,700గా కొనసాగుతోంది. శుక్రవారం కూడా ఇదే ధర పలికింది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 160 తగ్గి.. రూ. 59,510కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 59,670గా ఉండేది. ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం తగ్గాయి. 

దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,700గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,660గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,550 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 59,510గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

వెండి ధర ఇలా..
దేశంలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం100 గ్రాముల వెండి ధర రూ. 7,300గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 73,000గా కొనసాగుతోంది. శుక్రవారం కూడా ఇదే ధర పలికింది.
హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 76,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 73,000.. బెంగళూరులో రూ. 72,250గా ఉంది.