15 గంటలు శ్రమించినా ఫలించలే.. బోరు బావిలో పడ్డ చిన్నారి మృతి

15 గంటలు శ్రమించినా ఫలించలే.. బోరు బావిలో పడ్డ చిన్నారి మృతి

గుజరాత్ ఆమ్రేలిలోని సుర్గాపరా గ్రామంలో బోర్ బావిలో పడ్డ చిన్నారి చనిపోయింది. 15 గంటల పాటు రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టినా  ఫలించలేదు.

 జూన్ 14న సుర్గాపరా గ్రామంలో చిన్నారి  ఆడుకుంటూ వెళ్లి బోర్ బావిలో పడిపోయింది. విషయం తెలిసిన వెంటనే సహాయక బృందాలు హుటాహుటీన అక్కడకి చేరుకున్నాయి. 45 నుంచి 50 అడుగుల లోతులో బాలిక చిక్కుకున్నట్లు వెల్లడించారు. మధ్యాహ్నం పన్నెండున్నరకు చిన్నారిని బయటకు తెచ్చేందుకు ఆపరేషన్ ప్రారంభించారు అధికారులు.

 ఆక్సిజన్ పైపులను కిందకు దించి చిన్నారికి శ్వాస అందించారు.  దాదాపు 15 గంటల తర్వాత ఇవాళ తెల్లవారుజామున ఆమెను బయట తీసుకొచ్చారు. వెంటనే చిన్నారికి హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు.