వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఆక్సిజన్ కోసం పసిబిడ్డలు తండ్లాడుతున్నారు. శనివారం ఆస్ప త్రిలోనిఆర్ ఐసీయూ వార్డులో ఇద్దరు పసి బిడ్డలకు ఒకే ఆక్సిజన్ సిలిండరు రెండు వేర్వేరు పైపులు అమర్చి ఎక్స్రే విభాగానికి తీసుకెళ్తున్నారు. వీరి వెంట కనీసం ఆస్ప త్రి సిబ్బంది, కేర్టేకర్ లేకుండానే తల్లిదం డ్రుల సహాయంతో ఎక్స్రే విభాగానికి పం పించడంతో వివాదస్పదంగా మారింది.
పసిపిల్లల ప్రాణాలతో వైద్యులు చెలగాటం ఆడుతున్నారని రోగుల బంధువులు ఆరో పిస్తున్నారు. వరంగల్ నగరానికి చెందిన పార్వతి కుమార్తెతోపాటు హన్మకొండ జిల్లా భీందేవరపల్లి మండలానికి చెందిన దేవిక కుమారుడు ఆరోగ్యం బాగా లేకపో వడంతో ఆర్ ఐసీయూలో గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్నారు. అధి కారుల పర్యవేక్షణ కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
