సెక్స్‌ కట్టడి ‘మంచాల’పై ఒలింపిక్స్ నిర్వాహకుల క్లారిటీ

సెక్స్‌ కట్టడి ‘మంచాల’పై ఒలింపిక్స్  నిర్వాహకుల క్లారిటీ

టోక్యో: ఒలింపిక్స్‌లో శృంగార కట్టడి కోసం ఆటగాళ్ల గదుల్లో తక్కువ సామర్థ్యం ఉన్న బెడ్స్‌ను ఏర్పాటు చేశారన్న వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి భయం నేపథ్యంలో ప్లేయర్లు ఒకరితో మరొకరు కలవకుండా.. శృంగారంలో పాల్గొనకూడదనే ఉద్దేశంతో అట్ట మంచాలను ఏర్పాటు చేశారని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ విషయంపై టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు స్పందించారు. అట్టలతో చేసినప్పటికీ ఆ మంచాలు దృఢంగానే ఉంటాయని స్పష్టం చేశారు. 200 కిలోల బరువును కూడా మోయగలవని తెలిపారు. దీన్ని బలపరుస్తూ ఆ మంచాలపై ఐర్లాండ్‌కు చెందిన రిస్ మెక్లెనగన్ ఎగురుతూ రూపొందించిన ఓ వీడియోను నిర్వాహకులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మంచంపై ఎగురుతూ కనిపించిన రిస్.. యాంటీ సెక్స్ బెడ్స్‌పై వార్తలు ఫేక్ అంటూ చెప్పడాన్ని చూడొచ్చు.