
ఒలింపిక్స్ హాకీలో భారత మహిళల జట్టు క్వార్టర్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. లీగ్ చివరి మ్యాచ్ లో సౌతాఫ్రికాపై 4-3 తేడాతో గెలిచింది. వందనా కటారియా మూడు గోల్స్ తో అదరగొట్టింది. ఒలింపిక్స్ లో భారత్ తరుపున మహిళా ప్లేయర్ హాట్రిక్ గోల్స్ కొట్టడం ఇదే మొదటి సారి. నాలుగో నిమిషంలో ఫస్ట్ గోల్ కొట్టిన వందనా, 17 నిమిషంలో రెండో గోల్, 49వ నిమిషంలో మూడో గోల్ కొట్టింది. మూడో క్వార్టర్ 32 వ నిమిషంలో నేహా గోల్ కొట్టింది. అయితే గ్రూప్ ఏలో ఉన్న ఐర్లాండ్, బ్రిటన్ మధ్య ఇవాళ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ గెలిస్తే భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించాలి.ఒకవేళ బ్రిటన్ గెలిచినా..మ్యాచ్ డ్రా అయినా భారత్ క్వార్టర్ ఫైనల్ కు చేరుతుంది.