హంతకులు మరియు రేపిస్టులు అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్.

హంతకులు మరియు రేపిస్టులు అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్.

2017 సెప్టెంబర్‌లో జరిగిన ప్రముఖ జర్నలిస్టు కార్యకర్త గౌరీ లంకేష్ (55) హత్య కేసులో నిందితులుగా ఉన్న మొత్తం 17 మందిలో ఇద్దరికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పై వచ్చినవారికి పూలమాలలు వేస్తూ దుశ్శాలువాలు కప్పి సత్కరించారు. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ విషయంపై టాలీవుడ్ ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఆదివారం (అక్టోబర్ 13) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా "బెయిల్ ఈజ్ ది రూల్"  ఈ దేశంలో హంతకులు మరియు రేపిస్టుల కోసం మాత్రమే, అసహ్యకరమైనది" అంటూ ట్వీట్ చేశాడు. అలాగే జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్ చేశాడు. నిజానిజాలను ప్రజలకి చెప్పడంలో కీలక పాత్రపోషించే జర్నలిస్ట్ ని కిరాతకంగా హత్య చేసి జైలుకెళ్ళొచ్చిన వారిని ఇలా సత్కరించడం సరికాదని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా జర్నలిస్టు కార్యకర్త గౌరీ లంకేష్ ని  2017లో సెప్టెంబర్ 5న  బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌లో ఉన్న తన నివాసంలో ముగ్గురు వ్యక్తులు దారుణంగా కాల్పులు జరిపారు. ఈ క్రమంలో గౌరీ లంకేష్ కి దాదాపుగా 7 బుల్లెట్లు తగిలి అక్కడిక్కడే మరణించారు. హత్యానంతరం హంతకులు  నిందితులు ద్విచక్ర వాహనంపై పారిపోతుండగా పలు సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యింది. దీంతో గౌరీ లంకేష్ హత్యా కేసులో దాదాపుగా 17 మందికి సంబంధం ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు.