రిలీజ్ అయ్యాక నా రోల్‌ గురించే మాట్లాడుకుంటారు

రిలీజ్ అయ్యాక నా రోల్‌ గురించే మాట్లాడుకుంటారు

నటిగా ప్రయాణం మొదలుపెట్టిన పన్నెండేళ్ల తర్వాత పూర్ణ కెరీర్ స్పీడందుకుంది. వరుస సినిమాల్లో నటిస్తున్న ఆమె ‘అఖండ’లోనూ ఒక ఇంపార్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది.  డిసెంబర్ 2న మూవీ విడుదలవుతున్న సందర్భంగా కాసేపు ఇలా కబుర్లు చెప్పింది.

‘‘పద్మావతి అనే హెల్త్ మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తాను. హీరోకి, విలన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి మధ్య వారధి లాంటి పాత్ర. నా క్యారెక్టర్ డామినేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుందని 
డైరెక్టర్ ముందే చెప్పారు. మొదటిరోజు బాల సార్ ఎదురుగా నిలబడి డైలాగ్స్ చెప్పాలి. భయమేసింది కానీ ఆయన కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మాట్లాడి కంఫర్టబుల్ చేశారు. ఆయన ఎనర్జీ, డెడికేషన్ మామూలుగా ఉండవు. ఒక్కో ఫైట్ దాదాపు పదిహేడు రోజులుండేది. అందరూ అలసిపోయినా ఆయనలో మాత్రం అదే ఎనర్జీ. నిజంగా సింహమే  అనిపిస్తుంది. ఆయన రెండు గెటప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తారు. రెండింటితో నాకు కాంబినేషన్ సీన్స్ ఉంటాయి.  నాకు మూడు ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి.  రిలీజయ్యాక నా పాత్ర గురించే మాట్లాడుకుంటారు. ఈ సినిమాతో నా కెరీర్ టర్న్ అయిపోతుందని చెప్పను కానీ మంచి పాత్రలొస్తాయని మాత్రం అనుకుంటున్నాను. నాలుగైదు సీన్లే ఉన్నా, ఇంపాక్ట్ ఉండే పాత్రల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. శోభన, సుహాసిని, రేవతి వంటి వారిలా అన్ని రకాల పాత్రలూ చేయాలి. నేను నటించిన తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజవుతున్నాయి. వెబ్ సిరీస్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్ రానున్నాయి.’’