
టాలీవుడ్ యాక్టర్ సాయి కుమార్ (Saikumar)ప్రఖ్యాత కొమరం భీమ్ పురస్కారం (Komaram Bheem Award)అందుకోనున్నారు. నటుడిగా యాభై ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా.. 2024 సంవత్సరానికి గాను సాయికుమార్‌ను ఈ జాతీయ పురస్కారానికి ఎంపిక చేసినట్లు దాని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ సి.పార్థసారధి ప్రకటించారు.
'సాయికుమార్ నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా సినీ రంగానికి చేసిన సేవలకు గాను ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ అవార్డుతో పాటు జ్ఞాపికను, రూ.51,000ల నగదు అందిస్తామని' కమిటీ సభ్యులు తెలియచేసారు. భారత కల్చరల్ అకాడమి, ఓం సాయి తేజ ఆర్ట్స్, ఆదివాసి సాంస్కృతిక పరిషత్ సంయుక్త నిర్వహణలో గత 12ఏళ్లుగా ఈ పురస్కారాలు అందిస్తున్నారు.
Also Read:-శ్రీలీల డేటింగ్ రూమర్స్.. ఆ స్టార్ హీరో తల్లి కన్ఫమ్ చేసేసింది!
సాయికుమార్, నటుడు పి.జె.శర్మ కుమారుడు. ఆయన ఇద్దరు తమ్ముళ్ళు అయ్యప్ప శర్మ, రవిశంకర్ కూడా సినీ రంగంలో రాణిస్తున్నారు. కొడుకు ఆది సైతం తనదైన సినిమాలతో ఫామ్లో ఉన్నాడు.
కొమరం భీమ్ అవార్డు అందుకున్న సినీ ప్రముఖులు:
కొమరం భీమ్ అవార్డును పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, రచయిత అల్లాణి శ్రీధర్, లెజెండరీ నటుడు రాజేంద్ర ప్రసాద్, గూడ అంజయ్య వంటి దిగ్గజాలకు ఈ పురస్కారం వరించింది. మార్చ్ 23 వ తేది ఈ పురస్కారోత్సవం కొమరం భీమ్ జిల్లా, ఆసిఫాబాద్ కేంద్రంలోని ప్రమీల గార్డెన్స్ లో జరగనుంది.
సాయికుమార్ సినీ ప్రస్థానం:
సాయికుమార్ సినీ ప్రస్థానం డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభమైంది. ఆయన డబ్బింగ్ చెప్పిన తొలిచిత్రం ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన సంసారం అనే సినిమా. కొన్నాళ్ల తర్వాత బాలనటుడిగా కూడా అవకాశాలు వచ్చాయి. బాలనటుడిగా సాయికుమార్ చేసిన తొలి సినిమా దేవుడు చేసిన పెళ్లి (1975). అందులో ఆయన అంధుడిగా నటించాడు. ఇప్పటికీ (2025) వరుస సినిమాలతో బిజీగా ఉంటూ కీలక పాత్రలో నటిస్తున్నాడు.