సినిమాలతో పాటు బిజినెస్ లోనూ దూసుకెళ్తున్నారు

సినిమాలతో పాటు బిజినెస్ లోనూ దూసుకెళ్తున్నారు

ప్రస్తుతం చాలామంది సినీ సెలబ్రెటీస్ సినిమాలతో పాటు బిజినెస్ లోనూ దూసుకెళ్తున్నారు. నటులంటే కేవలం నటనకే పరిమితం కాదంటూ.. వ్యాపార రంగంలోనూ సత్తా చాటుతున్నారు. వివిధ రంగాల్లో వ్యాపారాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అది సినీ ఇండస్ట్రీలో కింగ్ అయినా సరే... అదే ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన యంగ్ హీరో, హీరోయిన్ అయినా సరే. ఒక్కసారి వ్యాపారంలోకి దిగామంటే.. బిజినెస్ మ్యాన్ మూవీలో లాగా దూసుకుపోవాల్సిందే అని అంటున్నారు.  

రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా..

పరుగెడ్తున్న కాలంతో పాటు మనము పరుగెత్తాలి. ఏదైనా సాధించాలనే ఆత్మ విశ్వాసం ఉంటే చాలు.. రోజు గడిచేలోపు అన్నీ  మన ముందుకొస్తాయి. అయితే ఇవన్నీ సినిమాల్లో జరుగుతుంటాయి. ఇక పేదవాడిగా ఉన్న హీరో కేవలం ఐదు నిమిషాల పాటు పూర్తయ్యే లోపు కోటీశ్వరుడు అయిపోతాడు. ఇవన్నీ వాస్తవ జీవితంలో జరిగే పనికాదంటారేమో.. కానీ అది రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా సాధ్యమేనని నిరూపిస్తున్నారు మన హీరో, హీరోయిన్ లు. ఒకవైపు సినిమాలతో ఫ్యాన్స్ కి వినోదాన్ని అందిస్తూనే.. మరోవైపు రకరకాల బిజినెస్ లలో రాణిస్తున్నారు. అలా సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న హీరోలు, హీరోయిన్ లు టాలీవుడ్ లో చాలామందే ఉన్నారు.

కింగ్ నాగార్జున ..

టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున సినిమాలు చేస్తూ... వ్యాపార రంగంలోనూ కింగ్ లా రాణిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు ఎ గ్రిల్ రెస్టారెంట్ అండ్ హోటల్ స్థాపించి హాస్పిటాలీటి రంగంలోనూ టాప్ ప్లేస్ లోనే ఉన్నారు. ఇక స్పోర్ట్స్ లోనూ పెట్టుబడులు పెట్టాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మెగాస్టార్ చిరంజీవితో కలిసి కేరళ బ్లాస్టర్స్ ఫుట్ బాల్ టీమ్ ని కొనుగోలు చేశాడు. స్వతహాగా కార్లు, బైక్ లు అంటే ఇష్టపడే నాగార్జున.. ఎమ్.ఎస్.ధోనితో కలిసి ఓ రేసింగ్ టీమ్ కి పార్ట్నర్ గానూ కొనసాగుతున్నారు.  

వెంకటేశ్ – మహేష్ .. 

ఇక వెంకటేశ్ తన అన్నతో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ స్టార్ట్ చేయడంతో పాటు... రీసెంట్ గా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ బిజినెస్ లోకి దిగాడు. బైక్ వో పేరుతో స్టార్టప్ ని ప్రారంభించిన వెంకీ... 2025 ఏడాదికల్లా దేశప్యాప్తంగా 20 వేల ఈవీ చార్జింగ్ స్టేషన్స్ ని స్థాపించడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు.

మహేష్ బాబు తన పేరు మీదే ఎంటర్టైన్మెంట్ సంస్థని స్థాపించాడు. దీంతోపాటు ‘ఏ.ఎమ్.బి. సినిమాస్’ పేరుతో ప్రీమియం లగ్జరీ మల్టిప్లెక్స్ ని నిర్మించాడు. ఇక ‘హంబుల్ కో’ పేరుతో టెక్ట్స్ టైల్ ఇండస్ట్రీలోకి ఎంటరయ్యాడు. మినర్వాతో కలిసి బంజారహిల్స్ రోడ్ నంబర్.12లో లగ్జరీ రెస్టారెంట్ ని ప్రారంభించబోతున్నాడు. పర్ఫ్యూమ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్లు సమాచారం.

మెగస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఓ ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేశారు. ప్రొడక్షన్ హౌజ్ ని చూసుకుంటూనే ఇటీవలే ఏయిర్ లైన్స్ బిజినెస్ లోకి ఎంటరయ్యాడు. ట్రూజెట్ ఏయిర్ లైన్స్ కి కో-ఓనర్ గా ఉన్నాడు.

అల్లు అర్జున్ – రానా :

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమకున్న స్టూడిస్ ని చూసుకోవడంతో పాటు అల్లు ఎంటర్టైన్మెంట్ పేరతో ప్రొడక్షన్ హౌజ్ ని రన్ చేస్తున్నాడు. దీంతో పాటు ఎం.కిచెన్ పేరుతో ఇంటర్ నేషనల్ బ్రూవింగ్ కంపెనిని ప్రారంభించాడు. దీనికింద 800జూబ్లీ పేరుతో బ్రూవింగ్, నైట్ క్లబ్ రెస్టారెంట్ ని నిర్వహిస్తున్నాడు. 2016లోనే బిజినెస్ మెన్ అనిపించుకున్న బన్నీకి... బి-డబ్స్ అనే స్పోర్ట్స్ బార్ లో పార్ట్నర్ షిప్ కూడా ఉంది. సిల్వర్ స్క్రీన్ పై స్టైలిష్ స్టార్ అనిపించుకున్న ఈ మెగా హీరో... బిజనెస్ లో కూడా అంతే సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నాడు.

మన బల్లాలదేవ రానా దగ్గుబాటి సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ అనిపించుకున్నాకే సినిమల్లోకి ఎంటరయ్యాడు. సినిమా రంగంలో 24 క్రాఫ్ట్స్ లోను నాలెడ్జ్ ఉన్న రానా.. కావ్యాన్ ట్యాలెంట్ మ్యానేజ్మెంట్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేశాడు. దీంతో పాటు వీడియో గేమింగ్ సంస్థల్లోను ఇన్వెస్ట్ చేశాడు. ఇటీవలే తన స్టార్టప్ సంస్థ ఐకాన్జ్ తో మెటావర్స్ లోకి ఎంటరయ్యాడు.

విజయ్ దేవరకొండ :

ఇక సీనియర్ హీరోలని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో.. కుర్ర హీరోలు సైతం బిజినెస్ లోకి ఎంటరౌతున్నారు. లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కూడా సినిమాలతో బిజిగా ఉంటూనే బిజినెస్ పై ద్రుష్టి పెట్టాడు. ఈ మధ్యే రౌడి క్లబ్ పేరుతో క్లాతింగ్ బ్రాండ్ ని లాంచ్ చేశాడు. దాంతో పాటు ఏవీడీ పేరుతో మహబూబ్ నగర్ లో మల్టిప్లెక్స్ లని స్థాపించాడు. వాటిని దేశప్యాప్తంగా విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ సైతం ఈవీ బిజినెస్ లోకి ఎంటరయ్యాడు. దీంతోపాటు గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు సమాచారం.

ఎన్టీఆర్ – రామ్ చరణ్..

వీరితో పాటు నాగశౌర్య రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాడు. తాను సంపాదించిన దాంట్లో 50 శాతం మనీతో భూములను కొంటున్నానంటున్న నాగశౌర్య, అమ్మతో కలిసి బిజినెస్ ని చేస్తున్నాడు. ఇక నవదీప్ కు సీ స్పేస్ అని మూవీ ప్రమోటర్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఉంది. సింగర్ రాహులు సిప్లిగంజ్ సైతం ఊకో-కాకా పేరుతో సొంత టెక్ట్స్ టైల్ బ్రాండింగ్ ను ప్రారంభించాడు.

వివాహ భోజనంబు పేరుతో రెస్టారెంట్లని ప్రారంభిస్తున్నాడు సందీప్ కిషన్. ఇక సై మూవీ నటుడు శశాంక్.. మాయాబజార్ పేరుతో రెస్టారెంట్లను నడిపిస్తున్నాడు. త్వరలోనే నాగ చైతన్య షోయూ పేరుతో క్లౌడ్ కిచెన్ ప్రారంభించబోతున్నాడు. త్రీపుల్ ఆర్ మూవీతో క్లోజ్ ఫ్రెండ్స్ అయిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు త్రిపుల్ ఆర్ పేరుతో భారీ రెస్టారెంట్ ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

హీరోయిన్స్ ..

మరోవైపు హీరోకి మేమేం తక్కువ కాదంటున్నారు హీరోయిన్ లు. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు ఎన్నేళ్లు వస్తాయని అనుమానాలో లేక బిజినెస్ లో తమను రాణులుగా చూస్కోవాలని కోరికో తెలీదు కానీ.. అవకాశం ఉన్నప్పుడే కోట్లకి పడగలెత్తాలని చూస్తున్నారు. దీంతో ఫిట్ నెస్ ఫ్రీక్ రకూల్ ప్రీత్ సింగ్.. ఆస్ట్రేలియన్ బ్రాండ్ ఎఫ్-45 ని ఫ్రాంచైజీలుగా తీసుకుని రన్ చేస్తోంది.

తమన్నా వైట్ ఎన్ గోల్డ్ పేరుతో గతంలోనే జ్యువెల్లరీ స్టోర్ లని స్థాపించింది. ఆన్ లైన్ లోను తమ జ్యువెలరీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు వీరి దారిలోనే నడుస్తోంది సమంత. సాకీ పేరుతో బట్టల వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన సమంత... ఇటీవలే ఏకమ్ పేరుతో ప్లే స్కూల్స్ ని స్థాపించింది. త్వరలోనే జ్యువెలరీ బిజినెస్ లోకి ఎంటరౌతున్నట్లు సమాచారం.. ఇలా మన టాలీవుడ్ స్టార్స్ సినిమాలతో పాటు వ్యాపారాల్లొనూ సత్తా చాటుతున్నారు.