ముగిసిన మా ఎన్నికల పోలింగ్

ముగిసిన మా ఎన్నికల పోలింగ్

హైదరాబాద్‌ : మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు పోలింగ్ ముగిసింది. శివాజీ రాజా, నరేష్‌ ప్యానెల్‌ లు గెలుపు కోసం నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. ఫిల్మ్‌ ఛాంబర్‌ లో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతోపాటు 470 మంది మూవీ అసోసియేషన్‌ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.