దర్శకుడు మెహర్ రిక్వెస్ట్.. స్పందించి మందులు పంపిన సోనూసూద్

V6 Velugu Posted on May 08, 2021

కరోనా మహమ్మారి బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటరమణ అనే వ్యక్తికి వెంటనే మందులు కావాలని దర్శకుడు మెహర్ రమేష్ ట్విట్టర్ ద్వారా చేసిన  రిక్వెస్ట్ కు రియల్ హీరో సోనూసూద్ వెంటనే స్పందించాడు. ట్విట్టర్లో వచ్చిన రిక్వెస్ట్ ను చూసిన వెంటనే   సోనుసూద్ యాక్సెప్ట్ చేసి.. వెంటనే మందులు అందేలా చేసి దటీజ్ సోనూసూద్ అని మరోసారి రుజువు చేసుకున్నాడు. ప్రస్తుత కరోనా కష్టకాలంలో బాగా వినిపిస్తున్న  పేరు సోనూసూద్. ప్రభుత్వాలను మించి పెద్దమనసుతో పేదలకు సాయం చేస్తున్నాడు. మంత్రులు, ముఖ్యమంత్రులే స్పందించి రిక్వెస్ట్ చేసే రీతిలో సోనూసూద్ స్పందిస్తున్న విషయం దేశంలో అందరికీ చిరపరిచితమే.  తాజాగా టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ ట్విట్టర్ లో వెంకట రమణ అనే పేసెంట్ కోసం కొన్ని ఇంజక్షన్స్, మెడిసిన్స్ కావాలని కోరడం జరిగింది. కేవలం 24 గంటల్లో  సోనూసూ రమేష్ అడిగిన మందులు అందించాడు. నిజానికి  Tocilizumb 400 mg ఇంజక్షన్ ను నిన్న విశాఖపట్టణంలో 12 లక్షలకు పైగా పలికింది.  కొందరు వెంకట రమణ పేషెంట్ తాలూకు వారికి 5 లక్షలకు విక్రయిస్తామని చెప్పారు. నిజానికి దీని ధర బయట 40 వేలు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది బయట ఇది దొరకడం లేదు. దీంతో కొందరు బ్లాక్ లో విక్రయిస్తున్నారు. అంత డబ్బు పెట్టి బ్లాక్ లో కొనే స్థోమత లేకపోవడంతో దర్శకుడు మెహర్ రమేష్ ద్వారా సోనూసూద్ కు రిక్వెస్ట్ పంపగా విలువైన ఇంజక్షన్స్, మెడిసిన్స్ సోనూసూద్ ఉచితంగా పంపడంతో వెంకట రమణ పేషెంట్ కు టైమ్ తో పాటు డబ్బు సేవ్ అయ్యింది. చాలా వేగంగా సోనూసూద్ చేసిన సహాయానికి మెహర్ రమేష్ ట్వీటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. సోనుసూద్ ప్రస్తుతం బెడ్స్, ఆక్సిజన్ లేని కోవిడ్ పేషెంట్లకు తన వంతు సహకారం అందిస్తున్నారు.

Tagged Tollywood director, , meher ramesh requests, sonusood latest updates, real hero sonusood, sonusood help

Latest Videos

Subscribe Now

More News