'శంకరాభరణం' మూవీ ఎడిటర్ జీజీ కృష్ణారావు కన్నుమూత

'శంకరాభరణం' మూవీ  ఎడిటర్ జీజీ కృష్ణారావు కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ ఎడిటర్ జీజీ కృష్ణారావు కన్నుమూశారు.  ప్రస్తుతం ఆయన వయసు 87  సంవత్సరాలు. మంగళవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. దాదాపుగా 300 పైగా సినిమా లకు ఆయన ఎడిటర్ గా పనిచేశారు. పూర్ణోదయా మూవీ క్రియేషన్స్, విజయ మాధవి ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థలకు  కృష్ణారావు ఆస్థాన ఎడిటర్ అని చెప్పవచ్చు. శంకరాభరణం, సాగర సంగమం, సిరివెన్నల, శృతిలయలు, ఆపద్బాంధవుడు, బొబ్బలిపులి, సర్దార్ పాపరాయుడు, శ్రీరామరాజ్యం లాంటి ఎన్నో చిత్రాలకు ఆయన ఎడిటర్గా  పనిచేశారు. కళాతపస్వీ కె విశ్వనాథ్, బాపు, జంధ్యాల, దాసరి వంటి దిగ్గజ దర్శకులతో ఆయన పనిచేశారు. కేవలం ఎడిటర్ గానే కాకుండా  నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను కృష్ణారావు నిర్మించారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని ప్రార్థిస్తూ సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.