
టాలీవుడ్ ఇండస్ట్రీ(Tollywood industry)లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవలే నిర్మాత కేపీ చౌదరి(KP Chaudary)ని డ్రగ్స్ ఇష్యూలో అరెస్ట్ చేసిన విషయంతెలిసిందే. తాజాగా ఈ డ్రగ్స్ దందాలో మరో సినీ నిర్మాత ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఇందులో భాగంగా తెలుగు సినీ నిర్మాత, మాజీ ప్రజా ప్రతినిది కుమారుడి తోసహా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మందితోపాటు కొంతమంది నైజీరియన్లను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.
Also Read :- బిగ్ బ్రేకింగ్ : వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత..
ఇక వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఉన్న సుశాంత్ రెడ్డి(Sushanth reddy) అనే వ్యక్తి ఈ డ్రగ్స్ దందా నడుపుతున్నట్లు యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులకు పక్కాగా సమాచారం అందింది. దీంతో గుడిమల్కాపూర్ పోలీసుల సహాయంతో సుశాంత్ రెడ్డితోపాటు ముగ్గురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు. ఇదే విషయంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈరోజు(సెప్టెంబర్ 14) సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించి.. పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.