టాలీవుడ్ సమ్మె.. ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల కీలక భేటీ.. పరిష్కారంపై ఉత్కంఠ.

 టాలీవుడ్ సమ్మె.. ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల కీలక భేటీ..  పరిష్కారంపై ఉత్కంఠ.

ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు ఛాంబర్ ప్రతినిధులతో సమావేశమైయ్యారు.  ఈ భేటీకి పలువురు నిర్మాతలతో పాటు కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్, ఫెడరేషన్ నుంచి అనిల్, అమ్మిరాజు, అలెక్స్ హాజరయ్యారు.  ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషన్, సెక్రటరీ దామోదర్ ప్రసాద్ తో చర్చలు జరుపుతున్నారు.  నిర్మాతల షరతులు, కార్మికుల డిమాండ్లపై చర్చిస్తున్నారు.

ఇప్పటికే నాలుగు డిమాండ్లను నిర్మాతల ముందుంచింది ఫిల్మ్ ఫెడరేషన్. అన్ని యూనియన్లకు సమానంగా వేతనాలను పెంచాలని పట్టుబడుతున్నారు. మరో వైపు నిర్మాతల షరతుల్లో రెండింటిని కార్మిక  సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.  ఇవాళ్టి సమావేశంతోనైనా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఫెడరేషన్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  వేతనాల పెంపు , డిమాండ్లపై ఫిల్మ్ ఛాంబర్ దే తుది నిర్ణయమని ప్రొడ్యూసర్స్ తెలిపారు. 

మరో వైపు ఫిలిం ఛాంబర్ లో సమావేశం అనంతరం .. ఫెడరేషన్ నేతలు చిరంజీవితో సమావేశం కానున్నారు. వేతనాల పెంపుపై నిర్మాతలు, కార్మికుల మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని చిరంజీవికి ఫెడరేషన్ సభ్యులు వివరించనున్నారు. ఇవాళ్టి చర్చలతో ఓ కొలిక్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఫెడరేషన్ సభ్యులు.