నోరూరించే టొమాటో దోశ.. బలాన్నిచ్చే నువ్వుల జ్యూస్.. కమ్మని రుచితో పాటు బోలెడంత ఆరోగ్యం..

నోరూరించే టొమాటో దోశ.. బలాన్నిచ్చే నువ్వుల జ్యూస్.. కమ్మని రుచితో పాటు బోలెడంత ఆరోగ్యం..

ప్రతిరోజూ రొటీన్ టిఫిన్స్‌ తిని బోర్ కొట్టిందా ? ఇన్స్టంట్‌గా ఏదైనా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కోసం చూస్తున్నారా? అయితే రాగిపిండి, బియ్యం పిండి కాంబినేషన్‌లో అదిరిపోయే 'టొమాటో దోశ'.. ట్రై చేయండి... అలాగే బలాన్నిచ్చే ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉండే 'నువ్వుల జ్యూస్ కాంబినేషన్ ట్రై చేయండి. టేస్టీగా ఉంటూనే రోజంతా యాక్టివ్‌గా ఉంచే ఈ రెండు హెల్తీ రెసిపీలు మీకోసం..

టొమాటో దోశ
కావాల్సినవి: 
టొమాటోలు: రెండు
అల్లం: కొద్దిగా 
పచ్చిమిర్చి: రెండు
రవ్వ: అరకప్పు
రాగిపిండి: అరకప్పు
బియ్యం పిండి: అరకప్పు
జీలకర్ర: అర టేబుల్ స్పూన్
ఉప్పు :తగినంత 
నీళ్లు: మూడు కప్పులు
నూనె: కొద్దిగా
ఉల్లిగడ్డ తరుగు, కొత్తిమీర: కొద్దిగా

తయారీ:
టొమాటో ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. ఒక గిన్నెలో టొమాటో పేస్ట్, రవ్వ, బియ్యం పిండి, రాగిపిండి, జీలకర్ర, ఉప్పు కలపాలి. తర్వాత కొద్ది, కొద్దిగా నీళ్లు పోస్తూ..  పలుచగా దోశపిండిలా కలపాలి. పొయ్యి మీద దోశ పెనం పెట్టి, వేడయ్యాక కొద్దిగా నూనె పూయాలి. ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి, దానిపై నుంచి ముందుగా కలిపిపెట్టిన పిండిని దోశలా పోయాలి. తర్వాత నూనె వేసి దోశ రెండువైపులా కాలిస్తే టొమాటో దోశ రెడీ.  

ALSO READ : షాపుకు ఎదురుగా ఇంటి మూల ఉంటే దోషమా? 


నువ్వుల జ్యూస్
కావాల్సినవి: 
తెల్లనువ్వులు: అరకప్పు
కొబ్బరి తురుము: అరకప్పు 
బెల్లం: అరకప్పు 
యాలకుల పొడి : ఒక టేబుల్ స్పూన్
నీళ్లు: ఒకటిన్నర కప్పు

తయారీ:
నువ్వులను బాగా కడిగి అరగంట నానబెట్టాలి. తర్వాత కొబ్బరి తురుము, నువ్వులను నీళ్లు పోస్తూ మిక్సీలో గ్రైండ్ చేయాలి.
తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టి జ్యూస్ను గ్లాసులో పోయాలి.  అందులో బెల్లం వేసి కరిగే వరకు కలపాలి.. చివర్లో యాలకుల పొడి వేస్తే
నువ్వుల జ్యూస్ రెడీ.