షాపుకు ఎదురుగా ఇంటి మూల ఉంటే దోషమా? చనిపోయిన వారి ఫోటో ఎక్కడ పెట్టాలి ?

షాపుకు ఎదురుగా ఇంటి మూల ఉంటే దోషమా? చనిపోయిన వారి ఫోటో ఎక్కడ పెట్టాలి ?

ప్రశ్న : మా దుకాణం తూర్పు అభిముఖంగా ఉంది. షాపు ముందు రోడ్డు ఉంది. దాని అవతల కొంచెం దూరంలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి కాంపౌండ్ వాల్ కార్నర్ మా షెటరుకి  ఎదురుగా ఉంది. దీనివల్ల ఏమైనా సమస్యలొస్తాయా?

జవాబు: మధ్యలో రోడ్డు ఉంది.. కాబట్టి పెద్దగా సమస్యలుండవు. రోడ్డు లేకపోతే మాత్రం కచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు భయపడాల్సిన పనిలేదు.


ఫొటో ఎక్కడ పెట్టాలి?
ప్రశ్న: మా ఇల్లు ఉత్తర అభిముఖంగా ఉంది. ఈ మధ్యే మా నాన్న చనిపోయాడు. ఆయన నిలువెత్తు ఫొటో ఫ్రేమ్ చేయించాం. ఇంట్లో ఏ దిక్కులో పెడితే బాగుంటుంది. దీనికేమైనా వాస్తు చూడాలా?.

జవాబు: ఇంట్లో ఎక్కడైనా... దక్షిణం వైపు ఉన్న గోడకు ఉత్తర ముఖంగా పెట్టుకోవచ్చు. లేదంటే పడమటి వైపు ఉన్న గోడకు తూర్పు ముఖంగా పెట్టుకోవచ్చు.

కాశీనాధుని శ్రీనివాస్
వాస్తు కన్సల్టెంట్ 
ఫోన్: 9440088799