జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు (గురువారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. మిలిటరీ డే రోజున అమర సైనికుల కుటుంబాల కోసం ప్రకటించిన రూ. కోటి విరాళాన్ని అందజేస్తారు. 20న ఉదయం కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించి.. రూ. కోటి చెక్కును సైనికాధికారులకు అందజేస్తారు. మధ్యామ్నం 3 గంటలకు విజ్ఞాన్ భవన్ లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు. దేశానికి యువ నాయకత్వం అవసరం గురించి విద్యార్థులతో మాట్లాడతారు. ఈ సదస్సులో పవన్ కళ్యాణ్ గురించి రూపొందించిన షార్ట్ ఫిలీంను టెలికాస్ట్ చేస్తారు. మేఘాలయ శాసన సభ స్పీకర్ మెత్బా లింగ్డో అధ్యక్షత వహిస్తున్న ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా కూడా పాల్గొననున్నారు.
see more news
బైక్ ను ఢీకొట్టిన కారు..తండ్రి మృతి, కొడుకుకి గాయాలు
మియాపూర్ లో హోటల్ లోకి దూసుకెళ్లిన కారు..ఒకరు మృతి
దెయ్యాలను 12 ట్రక్కుల్లో రోజుకు మూడుట్రిప్పుల్లో తరలించారంట.!
కొడుకు తాగుతున్నాడని.. చంపి ముక్కలు చేసిన తల్లి

