
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తోంది ఎలక్షన్ కమిషన్. జనవరి 1, 2019 నాటికి 18 ఏండ్లు నిండిన వారందరూ ఈ నెల 15 వరకు అంటే శుక్రవారం లోపు ఓటు నమోదు చేసుకోవచ్చన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. పార్లమెంట్ ఎన్నికల కోసం రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఓటర్ ఎన్ రోల్ మెంట్ విజయవంతంగా కొనసాగిందన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు రజత్ కుమార్.