రేపు ఏపీకి ప్రధాని మోడీ

రేపు ఏపీకి ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ రేపు(ఆదివారం) ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి మోడీ హాజరయ్యే ప్రజా చైతన్య సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు ఆ పార్టీ నేతలు. గుంటూరు శివార్లలోని ఏటుకూరు బైపాస్ దగ్గర జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ నేతలు పరిశీలించారు. భద్రతా సిబ్బంది తనిఖీలు ముమ్మరం చేశాయి. 1,700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన 1.33 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల చమురు నిల్వ కేంద్రాన్ని మోడీ జాతికి అంకితమివ్వనున్నారు. అటు ఓఎన్జీసీ ఆధ్వర్యంలో కేజీ బేసిన్ లో ఏర్పాటు చేసిన గ్యాస్ ఫీల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. కృష్ణపట్నంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆధ్వర్యంలో చమురు సమీకరణ టెర్మినల్ కు శంకుస్థాపన చేయనున్నారు.

మరోవైపు గుంటూరులో మోడీ పర్యటనకు వ్యతిరేకత ఎదురవుతోంది. కృష్ణా జిల్లా గన్నవరం జాతీయ రహదారిపై మోడీ ఫొటోలతో.. మోడీ నెవర్ అగైన్ అంటూ భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా సాధన సమితి, వామపక్షాలు కూడా నిరసనలు పాల్గొనే అవకాశం ఉంది.

ప్రధాని షెడ్యూల్…

…ఉదయం 10.45 కు ఎయిర్‌పోర్టుకు

…హెలికాప్టర్‌లో 11.05 కు గుంటూరుకు

…11.15 కు గుంటూరులోని యెటుకురు బైపాస్‌ రోడ్డుకు

…11.20 వరకు పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొంటారు… ప్రాజెక్టుల పై స్పీచ్

…11.20 నుంచి 11.25 వరకు శిలాఫలకాన్ని ఆవిష్కరణ

…కృష్ణపట్నంలో నిర్మించే BPCL కోస్టల్‌ టెర్మినల్‌కు భూమి పూజ

….11.25కి బయలుదేరి.. 11.30కి గుంటూరు పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొంటారు

…మధ్యాహ్నం 12.15 వరకు పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొని.. 12.25కు గుంటూరు హెలిపాడ్‌ కు చేరుకుంటారు

…12.30కు హెలికాప్టర్‌లో బయలు దేరి 12.50కి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తారు