రేపు భాగ్యలక్ష్మి దేవాలయాన్ని దర్శించుకోనున్న యోగి

రేపు భాగ్యలక్ష్మి  దేవాలయాన్ని దర్శించుకోనున్న యోగి

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్​ కు వచ్చిన ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాతబస్తీకి వెళ్లనున్నారు.  ఆదివారం ఉదయం 6 గంటలకు  పాతబస్తీలోని భాగ్యలక్ష్మి దేవాలయాన్ని ఆయన దర్శించుకోనున్నారు.  ఈసందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.  పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ లు కూడా ఆయన వెంట ఓల్డ్ సిటీకి వెళ్లనున్నారు. కాగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు 18 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మొత్తం 348 మంది పార్టీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.