నిజామాబాద్ లో రేపు సీఎం కేసీఆర్ సభ

నిజామాబాద్ లో రేపు సీఎం కేసీఆర్ సభ

నిజామాబాద్ లో రేపటి సీఎం కేసీఆర్ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్స్ లో రేపు సాయంత్రం ఆరింటికి సభ ప్రారంభం కానుంది. నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిలు దగ్గరుండి సభ ఏర్పాట్లు చూస్తుండగా.. ఎంపీ కవిత, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు సభను సక్సెస్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. నగరంలోని ప్రధాన రోడ్లు, సర్కిళ్లను గులాబీ జెండాలతో అలంకరించారు.

గులాబీదండుతోనే..గులాంగిరీ పొతుందున్నారు  ఎంపీ కవిత. 16 ఎంపీ సీట్లు గెలిస్తే..రాష్ట్ర హక్కుల్ని సాధిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్ సభ స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమంటున్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి

స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి జగిత్యాలలో పర్యటించారు కవిత. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కవిత సమక్షంలో ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు.

సభకు జనసమీకరణపై ద్రుష్టి పెట్టిన నేతలు.. పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి 2 లక్షలకు పైగా జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు వచ్చే జనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. నగరంలోని వివిధ స్థలాల్లో పార్కింగ్ సౌకర్యాలు కల్పించారు. అటు పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.