Cricket World Cup 2023: వరల్డ్ కప్ లో విధ్వంసం..సెంచరీల మోత మోగించిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు

Cricket World Cup 2023: వరల్డ్ కప్ లో విధ్వంసం..సెంచరీల మోత మోగించిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు

వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా జట్టు జూలు విదిల్చింది. చోకర్స్ గా ఉన్న ముద్రను తుడిచేసుకునే పనిలో ఉంది. ఇప్పటివరకు చప్పగా జరిగిన మ్యాచులను చూస్తూ కాస్త నిరాశ పడ్డ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచింది.  శ్రీలంకపై బౌలర్లను ఒక ఆట ఆడుకుంటూ వరల్డ్ కప్ చరిత్రలోనే భారీ స్కోర్ చేశారు. బౌండరీల వర్షం కురిపిస్తూ ఢిల్లీ స్టేడియాన్ని హోరెత్తించారు. ఏకంగా ముగ్గురు సెంచరీలు చేసి శ్రీలంకకు వరల్డ్ కప్ లో పీడకలను మిగిల్చారు. 

టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా జట్టు ప్రారంభంలో కెప్టెన్ బావుమా వికెట్ మాత్రమే వారికి ఆనందాన్ని మిగిల్చింది. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన వాండెర్ డసెన్(110 బంతుల్లో 108, 13 ఫోర్లు, 2 సిక్సులు) ఓపెనర్ డికాక్(84 బంతుల్లో 100 12 ఫోర్లు,3 సిక్సులు) స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించారు. వీరిద్దరూ రెండో వికెట్ కి 204 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

ఇక్కడ దాకా ప్రశాంతగా సాగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ మార్కరం వచ్చేసరికి నెక్స్ట్ లెవల్లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సాగింది. వరల్డ్ కప్ లో అల్ టైం రికార్డ్ బద్దలు కొడుతూ 49 బంతుల్లోనే సెంచరీ నెలకొల్పాడు. మొత్తం 54 బంతుల్లో 106 పరుగులు చేసి సఫారీలు 400 మార్క్  రీచ్ అయ్యేలా చేసాడు. మార్కరం ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు,3 సిక్సులు ఉన్నాయి. ఈ ముగ్గురు శతకాల మోత మోగించడంతో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 428 పరుగులు చేసి వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా చరిత్ర  సృష్టించింది.