14 వేల ట్విన్స్ పెయిర్స్ ఒక్కచోటే.. అయినా రికార్డ్​ కొట్టలే

14 వేల ట్విన్స్ పెయిర్స్ ఒక్కచోటే.. అయినా రికార్డ్​ కొట్టలే

అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. అన్నట్టు, శ్రీలంకలో గిన్నిస్​ రికార్డు కొట్టేద్దామనుకున్న కొందరి ఆరాటం బెడిసికొట్టింది. అవును, ఒకటా.. రెండా 14 వేల ట్విన్స్​ (కవలలు) పెయిర్స్​ కలిస్తే ఎలా ఉంటుంది? రికార్డు కాదు కదా.. తలకాయనొప్పులు తెచ్చిపెట్టింది. ‘ఐలాండ్​ ట్విన్స్’ పేరిట  కొలంబోలో ‘గిన్నిస్’ రికార్డు కోసం ఈవెంట్​ నిర్వహించారు. 5 వేల కవలల జతలతో రికార్డు కొట్టేద్దామనుకుంటే అంతకుమించి రావడంతో  స్టేడియం కిక్కిరిసిపోయింది. వాళ్ల  పేర్ల నమోదులో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో గిన్నిస్​ నిబంధనలూ  పాటించలేకపోయారు. ట్విన్స్​బర్త్ సర్టిపికెట్లు చెకింగ్​తో పాటు, ట్విన్స్​ ఫొటో తీయాలి. ఒక్కో జంటకు 5నిమిషాలు పట్టింది. టైం లేక చాలామంది వెనుదిరిగి వెళ్లిపోయారు. ‘రికార్డు కొట్టామా? లేదా? అనేది రెండు వారాల తర్వాత తెలుస్తుంది. రికార్డు కోసం మరో ఈవెంట్ నిర్వహిస్తాం’ అని ఆర్గనైజర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ రికార్డు తైవాన్ పేరిట ఉంది. 1999లో 3,961 ట్విన్స్​పెయిర్స్, 37 పెయిర్స్ ట్రిప్లెట్స్ (ముగ్గురు కవలలు), 4 పెయిర్స్​ క్వాడ్రప్లెట్స్​(నలుగురు కవలలు)తో ఈ రికార్డు నెలకొల్పారు.