గ్రెటా థన్​బర్గ్  ‘టూల్ కిట్’ కేసు.. పరారీలో ఇద్దరు!

గ్రెటా థన్​బర్గ్  ‘టూల్ కిట్’ కేసు.. పరారీలో ఇద్దరు!
  • అడ్వకేట్ నికితా జాకబ్, ఇంజనీర్ శంతను ఎక్కడున్నరో!
  • దిశతో కలిసి వీళ్లిద్దరే టూల్ కిట్ క్రియేట్ చేసిండ్రు
  • ఖలిస్తాన్ అనుకూల సంస్థ పీజేఎఫ్‌‌‌‌‌‌‌‌తో జూమ్ మీటింగ్
  • వెల్లడించిన ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: స్వీడిష్ క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్​బర్గ్ రైతుల నిరసనలకు మద్దతుగా ‘టూల్ కిట్(డాక్యుమెంట్)’ను షేర్ చేసిన కేసులో మరో ఇద్దరికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ కేసులో బెంగళూరు క్లైమేట్​ యాక్టివిస్ట్ దిశా రవిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు.. కోర్టు పర్మిషన్​తో ఆదివారం ఆమెను ఐదు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. టూల్ కిట్ తయారీలో కీలకంగా వ్యవహరించిన ముంబైకి చెందిన అడ్వకేట్ నికితా జాకబ్, మహారాష్ట్రలోని బీడ్ కు చెందిన ఇంజనీర్ శంతనులపై వారెంట్లు జారీ అయ్యాయని పోలీసులు సోమవారం చెప్పారు. దిశతో కలిసి వీరిద్దరూ కెనడాకు చెందిన మో ధలివాల్ ఆధ్వర్యంలోని ఖలిస్తాన్ అనుకూల సంస్థ పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్(పీజేఎఫ్)తో టచ్​లో ఉంటూ టూల్ కిట్ ను రూపొందించారని చెప్పారు. అడ్వకేట్​ నికిత, ఇంజనీర్​ శంతను పరారీలో ఉన్నారని, వారి కోసం వెతుకుతున్నామన్నారు. అయితే, నికిత సోమవారం బాంబై హైకోర్టులో ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ వేశారు. నాలుగు వారాల గడువిస్తే ఢిల్లీలోని కోర్టులో ప్రిఅరెస్ట్ బెయిల్ కోసం అప్లై చేసుకుంటానని నికిత కోరారు. ఈ పిటిషన్​ను మంగళవారం విచారిస్తామని కోర్టు చెప్పింది.

టూల్ కిట్‌‌‌‌‌‌‌‌లో యాక్షన్ ప్లాన్

‘‘సోషల్ మీడియాలో మేం ఓ గూగుల్ డాక్యుమెంట్ (టూల్ కిట్)ను ఫిబ్రవరి 4న గుర్తించాం. దానిని పీజేఎఫ్ క్రియేట్ చేసిందని తేలింది. అందులోని ఒక పార్ట్ లో జనవరి 23 నుంచి 26 వరకూ ట్వీట్ల స్టార్మ్‌‌‌‌‌‌‌‌, ఫిజికల్ యాక్షన్, హ్యాష్ ట్యాగ్ లతో డిజిటల్ స్ట్రైక్ ల వంటి యాక్షన్ ప్లాన్ ఉంది. డాక్యుమెంట్ రెండో పార్ట్ లో యోగా, టీ వంటి ఇండియన్ కల్చర్ ను విధ్వంసం చేయాలని, విదేశాల్లోని ఇండియన్ ఎంబసీల ముందు నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు” అని పోలీసులు వివరించారు. ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజున జరిగిన సంఘటనలు అచ్చం ఈ టూల్​ కిట్​లో చెప్పినట్లే ఉన్నాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

For More News..

పాడి రైతులకు ఇన్సెంటివ్​ రావట్లే

ఎన్జీటీ వద్దన్నా.. ఏపీ సంగమేశ్వరం పనులు చేస్తోంది

కేసీఆర్​పై బాహుబలి రేంజ్​లో డాక్యుమెంటరీ

ఆందోళనలో పాల్గొన్నాడని బీజేపీ లీడర్​ ఇల్లు కూల్చివేత