టూల్స్ గాడ్జెట్స్ : యోగర్ట్‌‌ మేకర్‌‌‌‌

టూల్స్ గాడ్జెట్స్ : యోగర్ట్‌‌ మేకర్‌‌‌‌

పెరుగు తోడేయడం (యోగర్ట్‌‌) కొందరికి సరిగా రాదు. పెరుగు బాగా తోడు కావాలంటే పాల వేడి, వేసే తోడు సరిగా ఉండాలి. అందులో ఏ మాత్రం తేడా వచ్చినా పెరుగైనా తోడుకోదు. పుల్లగా అయినా మారుతుంది. అందుకే ఆ ఇబ్బందులేవీ లేకుండా యోగర్ట్​ మేకర్​ వచ్చేసింది మార్కెట్​లోకి. ఈ గాడ్జెట్‌‌ఉంటే పెరుగు తయారీ తిప్పలే ఉండవు. దీన్ని బెల్లాక్స్ ఎంటర్‌‌‌‌ప్రైజ్‌‌ అనే కంపెనీ తయారుచేసింది. ఇందులో పెరుగు తయారీకి 6 నుండి 8 గంటలు పడుతుంది. 

దీన్ని ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీ. ఫుడ్ గ్రేడ్ స్టెయిన్‌‌లెస్ స్టీల్ మెటీరియల్‌‌తో దీన్ని తయారుచేశారు. ఇందులో ఒక లీటర్ గిన్నె వస్తుంది.  ఆటోమేటిక్ ఇంటెలిజెంట్ ఆపరేషన్ ప్యానెల్ ఉండడం వల్ల టెంపరేచర్‌‌‌‌ని ఆటోమేటిక్‌‌గా అదే కంట్రోల్‌‌ చేసుకుంటుంది. దీనికి పవర్-ఆఫ్ మెమరీ ప్రొటెక్షన్ కూడా ఉంది. పెరుగు, ఎంజైమ్స్‌‌, రైస్ వైన్, డౌ, ఫ్రూట్ వెనిగర్ లాంటివాటిని ఫర్మెంట్‌‌ చేసేందుకు కూడా దీన్ని వాడొచ్చు.

ధర : 489 రూపాయలు 

ఆటోమేటిక్ దోశ మేకర్

అందరూ ఇష్టంగా తినే టిఫిన్ దోశ. కానీ.. ఇడ్లీ, ఉప్మాలాంటి మిగతా బ్రేక్​ఫాస్ట్​లతో పోలిస్తే దోశలు వేయడానికి ఎక్కువ టైం పడుతుంది. అందుకే ఎవోచెఫ్‌‌ అనే కంపెనీ ఎలక్ట్రిసిటీతో పనిచేసే ఆటోమేటిక్‌‌ దోశ మేకర్‌‌‌‌ని తయారుచేసింది. ఇది ఒక్క నిమిషంలోనే దోశెని రెడీ చేస్తుంది. ఇందులోని కంటైనర్‌‌‌‌లో దోశ పిండి వేసి, స్విచ్​ ఆన్​ చేస్తే చాలు. దోశ ఎంత మందంగా ఉండాలనేది కూడా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఆటోమేటిక్ సేఫ్టీ కట్-ఆఫ్ ఫీచర్ కూడా ఉంది. అంటే.. వాడడం మానేస్తే మూడు నిమిషాల్లో ఆటోమేటిక్‌‌గా ఆఫ్ అయిపోతుంది. కాంపాక్ట్, పోర్టబుల్ డిజైన్‌‌ కావడం వల్ల దీనికి ఎక్కువ ప్లేస్​ అవసరం ఉండదు. ఒక -ఏడాది వారెంటీతో వస్తుంది. 

ధర : 13,995 రూపాయలు

నైఫ్‌‌ షార్ప్‌‌నర్‌‌‌‌ 

ఇంట్లో కూరగాయలు, మాంసం కోసే కత్తులు పదే పదే మొండిబారతాయి. వాటికి పదును పెట్టించడానికి అక్కడా ఇక్కడా వెతుక్కోలేక కొందరు నెలకో కత్తి కొంటుంటారు. కానీ.. ఈ షార్ప్‌‌నర్‌‌‌‌ ఉంటే కత్తులు కొనే అవసరం ఉండదు. వాసుకి అనే కంపెనీ తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్‌‌ నైఫ్ షార్ప్‌‌నర్‌‌‌‌తో కత్తులతోపాటు బ్లేడ్స్‌‌, కత్తెరలు, టూల్స్‌‌ వేటికైనా పదును పెట్టొచ్చు. ఇందులో హై-స్పీడ్ మోటారు ఉంటుంది. కాబట్టి పది సెకన్లలోనే ఒక కత్తికి పదును పెడుతుంది. ఈ గాడ్జెట్‌‌కు పైభాగంలో ఉండే షార్పెనింగ్‌‌ స్టోన్‌‌తో మాన్యువల్‌‌గా కూడా కత్తులకు పదును పెట్టుకోవచ్చు. దీన్ని ఏబీఎస్‌‌ ప్లాస్టిక్‌‌తో తయారుచేశారు. చాలా మన్నికగా ఉంటుంది. ఎర్గోనామిక్ హ్యాండిల్‌‌తో వస్తుంది. 

ధర : 1,070 రూపాయలు

మినీ ఎలక్ట్రిక్‌‌ చాపర్‌‌‌‌ 


కూరగాయలు తరిగేందుకు ఇప్పటివరకు ఎన్నో రకాల టూల్స్‌‌ వచ్చాయి. వాటితో ఈజీగా కట్‌‌ చేసుకోవచ్చు. కానీ.. ఈ గాడ్జెట్‌‌ ఉంటే మనం కట్‌‌ చేయాల్సిన పని లేకుండా అదే కట్‌‌ చేసి పెడుతుంది. దీన్ని ఇన్‌‌స్టాకప్పా అనే కంపెనీ తయారుచేసింది. దీంతో పండ్లు, కూరగాయలను సులువుగా కట్‌‌ చేసుకోవచ్చు. కూరగాయలు కడిగి దీనికి పై భాగంలో ఉన్న కంటైనర్‌‌‌‌లో వేస్తే.. అదే కట్‌‌ చేసి పెడుతుంది. బిజీగా ఉండే తల్లులు, బ్యాచిలర్స్‌‌కి ఇది భలే హెల్ప్​ చేస్తుంది. ఇందులో 45వాట్స్ మోటార్ ఉంటుంది. పదునైన స్టెయిన్‌‌లెస్ స్టీల్ బ్లేడ్స్‌‌తో వస్తుంది. 30 నుండి 60 సెకన్లలో కూరగాయలను కట్‌‌ చేయొచ్చు. ఇది బరువు తక్కువగా ఉంటుంది. పిక్నిక్‌‌, టూర్స్‌‌కి వెళ్లినప్పుడు కూడా దీన్ని తీసుకెళ్లొచ్చు. యూఎస్‌‌బీతో రీఛార్జ్ చేసుకోవచ్చు. 

ధర : 999 రూపాయలు