Defence Stocks: డిఫెన్స్ స్టాక్ కొనాలనుందా.. బ్రోకరేజ్ సెలెక్ట్ చేసిన 4 సూపర్ స్టాక్స్ ఇవే..

Defence Stocks: డిఫెన్స్ స్టాక్ కొనాలనుందా.. బ్రోకరేజ్ సెలెక్ట్ చేసిన 4 సూపర్ స్టాక్స్ ఇవే..

Defence Stocks to Buy: గతనెల దాయాది దేశం పాకిస్థాన్ లోపల దాగిఉన్న ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో ఇండియా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో యుద్ధం కొత్త రూపుదిద్దుకుని పూర్తిగా టెక్నాలజీ ఆధారితంగా కొనసాగిన సంగతి తెలిసిందే. దీంతో పాక్ భూభాగంలోకి అడుగుపెట్టకుండానే ఇండియా తన ఆయుధాలను, టెక్నాలజీలను ఉపయోగించి అత్యంత ఖచ్చితత్వంతో దాడులను చేపట్టగలిగింది. దీంతో దేశీయ రక్షణరంగ సంస్థల షేర్లకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. 

దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు డిఫెన్స్ రంగంలో వ్యాపారాన్ని కలిగి ఉన్న కంపెనీల షేర్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారికోసం బ్రోకరేజ్ సంస్థ యాంటిక్ ఎంపిక చేసిన నాలుగు షేర్ల గురించి తప్పక తెలియాల్సిందే. ఇటీవల బ్రోకరేజ్ నిర్వహించిన సదస్సులో భారత ప్రభుత్వం తన డిఫెన్స్ అవసరాల కోసం ఏకంగా రూ.13లక్షల 80వేల కోట్లను వెచ్చించాలని చూస్తున్నట్లు పేర్కొంది. ఆత్మనిర్భర భారత్ కింద ప్రభుత్వం ఎక్కువగా తన డిఫెన్స్ అవసరాలను దేశీయ తయారీదారుల నుంచే ప్రొక్యూర్ చేయాలని నిర్ణయించింది.

- భారీ ఆర్డర్ పైల్ లైన్ ఉన్నందున హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ షేర్లు కొనుగోలుకు ఉత్తమంగా పేర్కొంది. 2030 నాటి వరకు కంపెనీ రూ.2 లక్షల కోట్ల విలువైన ఆర్డర్లను డెలివరీ చేయాల్సి ఉంది. కంపెనీ వ్యూహాత్మకంగా టెక్నాలజీ భాగస్వామ్యాలు భారత వైమానిక అవసరాలను తీర్చటానికి దోహదపడతాయని బ్రోకరేజ్ వెల్లడించింది. 

- బ్రోకరేజ్ ఎంపిక చేసిన రెండవ స్టాక్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి, ఏఐ వినియోగం వంటివి కంపెనీని పెట్టుబడికి ఉత్తమ ఎంపికగా మార్చుతున్నాయి. అలాగే కంపెనీ తయారు చేసిన దేశీయ QRSAM మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కోసం ఆర్డర్లు పెరగటం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది.  

- దేశీయ నేవీ అవసరాలను తీర్చటంలో చాలా కాలంగా కీలక పాత్ర పోషిస్తున్న సంస్థ మజగాన్ డాక్‌యార్డ్స్ అండ్ షిప్ బిల్డర్స్. ఈ సంస్థ వెజెల్స్, సబ్ మెరైన్స్ తయారీలో దేశీయ అవసరాలను తీర్చుతోంది. స్కార్పీన్ జలాంతర్గాములకు రాబోయే ఆర్డర్‌లు, సాంకేతిక బదిలీ కోసం థైసెన్ క్రుప్‌తో సహకారాలు కీలకమైన అవకాశంగా ఉంది. దీంతో కంపెనీ ఆర్టర్ బుక్ మరింత రద్దీగా మారుతుందని బ్రోకరేజ్ పేర్కొంది. 

- ఇక చివరిగా బ్రోకరేజ్ PTC ఇండస్ట్రీస్ షేర్లు డిఫెన్స్ రంగంలో పెట్టుబడికి అనుకూలంగా పేర్కొంది. ఇది తన అనుబంధ సంస్థ ఏరోల్లాయ్స్ టెక్నాలజీస్ ద్వారా లక్నోలో ఒక స్ట్రాటజిక్ మెటీరియల్ టెక్నాలజీ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేస్తోంది. భవిష్యత్తులో ఇది కంపెనీ ఆదాయాన్ని గణనీయంగా పెంచనుంది. రాబోయే 5-6 సంవత్సరాల్లో 10-20 రెట్లు వృద్ధిని అంచనా వేయబడింది.

ప్రస్తుతం భారతీయ డిఫెన్స్ రంగంలో ప్రైవేటు సంస్థలు, కంపెనీల ప్రాధాన్యత పెరుగుతోంది. ఇది చాలా రక్షణ పరికరాల తయారీదారులలో లాభదాయకతకు మద్దతిస్తోంది. పైగా దేశీయ వినియోగంతో పాటు ఎగుమతులకు పెరుగుతున్న ఆర్డర్లు భవిష్యత్తులో భారత డిఫెన్స్ రంగానికి మంచి రోజులుగా చెప్పబడుతోంది. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.