డేంజర్లో మగజాతి:ఈ 5 రకాల క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి..!

డేంజర్లో మగజాతి:ఈ 5 రకాల క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి..!

క్యాన్సర్..ఇప్పుడు భారత్లో తీవ్రమైన ప్రజారోగ్య సమస్య. ముఖ్యంగా పురుషులలో క్యాన్సర్ క్రమంగా పెరుగుతోంది. నోటి, ఊపిరితిత్తులు, అన్నవాహిక క్యాన్సర్లు ప్రబలంగా ఉన్నాయి. పొగాకు, కాలుష్యం, జీవనశైలి కారకాల వల్ల క్యాన్సర్ బారినపడుతున్నారు. జీవనశైలి మార్పులు, పొగాకు ,మద్యం వాడకం, పర్యావరణ కారకాలు వంటి అనేక అంశాలు క్యాన్సర్ పెరుగుదలకు కారణమవుతున్నాయి. 

పురుషులలో కనిపించే 5 క్యాన్సర్ రకాలు ..

ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer):

సిగరెట్లు, బీడీలు, పొగ లేని పొగాకు వినియోగం ఊపిరితిత్తుల క్యాన్సర్ కు ప్రధాన కారణం. వాయు కాలుష్యం, వృత్తిపరమైన ప్రభావం, కుటుంబ చరిత్ర కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ మరో కారణం. భారతదేశంలో పురుషులలో క్యాన్సర్ సంబంధిత మరణాలకు ఇది ప్రధాన కారణాలలో ఒకటి.

నోటి క్యాన్సర్ (Oral Cancer):

పొగాకు నమలడం, ధూమపానం, గుట్కా, పాన్ మసాలా, అరెకా గింజలు, మద్యం సేవించడం వంటి కారణాలతో నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాం ఎక్కువ. ఇవి నోటి కుహరం, నాలుక, చిగుళ్ళు, పెదవులు,గొంతును ప్రభావితం చేస్తాయి. నోటి క్యాన్సర్ కేసుల్లో ప్రపంచంలోనే భారత్ రెండవ స్థానంలో ఉంది. చాలా కేసులు ఆలస్యంగా గుర్తించబడి చికిత్స మరింత కష్టతరం మారుతోంది. 

ప్రోస్టేట్ క్యాన్సర్ (Prostate Cancer):

ప్రోస్టేట్ క్యాన్సర్ .. ప్రధానంగా 50 ఏళ్లు పైబడిన పురుషులలో వస్తుంది. వయస్సు, కుటుంబ చరిత్ర, ఆహారపు అలవాట్లు (అధిక కొవ్వు ఆహారం) ప్రోస్టోట్ క్యాన్సర్ కు ప్రధాన కారణాలు. భారత్ లో ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముందస్తు పరీక్షలు, అవగాహనతో గుర్తించి చికిత్స చేయవచ్చు.

పెద్దప్రేగు, పురీషనాళ క్యాన్సర్ (Colorectal Cancer):

జీవనశైలి మార్పులు, తక్కువ ఫైబర్ తీసుకోవడం, అధిక కొవ్వు కలిగిన ఆహారం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం ,మద్యం సేవించడం వంటివి పెద్ద ప్రేగు క్యాన్సర్ కు దారి తీస్తాయి. దీనికి దోహదపడతాయి. వంశపారంపర్యం కూడా కొంతమందిలో కారణం కావచ్చు.పశ్చిమ దేశాలలో సాధారణంగా కనిపించే ఈ క్యాన్సర్, భారత్ లో  కూడా పట్టణ ప్రాంతాలలో పెరుగుతోంది. 

అన్నవాహిక క్యాన్సర్ (Esophageal Cancer):

పొగాకు ,మద్యం వినియోగం, ఊబకాయం, దీర్ఘకాలిక యాసిడ్ రిఫ్లక్స్ (GERD) వంటివి అన్నవాహిక క్యాన్సర్‌కు ప్రధాన ప్రమాద కారకాలు.భారత్ లో ఐదు అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఇది ఒకటి. ఇది స్త్రీలకంటే పురుషులలో ఎక్కువగా వస్తుంది. 

ఈ క్యాన్సర్లు రాకుండా నివారించాలంటే.. ఆరోగ్యకరమైన జీవనశైలి, ధూమపానం , మద్యం సేవించడం వంటి మానుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.