
కోలీవుడ్ నటుడు విజయ్ ఇటీవలి కాలంలో రాజకీయ వర్గాల్లో పాపులర్ వ్యక్తిగా మారుతున్నారు. అతని ఇటీవలి స్వచ్ఛంద కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయ ప్రవేశం గురించి ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు సైతం పలు చర్చలకు దారితీశాయి. ఈ క్రమంలో విజయ్ తన పరిధిని మరింత విస్తరించడానికి, ప్రేక్షకులతో సన్నిహితంగా ఉండటానికి సోషల్ మీడియాను చురుకుగా ఉపయోగిస్తున్నాడు. అతని ప్రజాసంఘం కార్యదర్శి బుస్సి ఆనంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన ప్రజాసంఘాల కార్యకర్తలు సమావేశమయ్యారు. వివిధ కార్యక్రమాలు, చేపట్టాల్సిన ఈవెంట్స్ పై సభ్యులు ధీర్ఘంగా చర్చించారు. వారు వాట్సాప్ గ్రూపుల ద్వారా సాంకేతికతను ఉపయోగించుకోవాలని, కమ్యూనికేషన్‌ను మెరుగుపరచాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
అందుకోసం ఇప్పటికే దాదాపు 1వెయ్యి 6వందల వాట్సాప్ గ్రూపులను రూపొందించారని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు 10వేల వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేయాలనేది ప్రస్తుతానికి ఉన్న కొత్త ప్రణాళిక అని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రజాప్రతినిధులతో కనెక్ట్ అయ్యేందుకు. వారి సమస్యలను పరిష్కరించడానికి వాట్సాప్ గ్రూపులను ఉపయోగించుకునే ఈ వ్యూహం గతంలో MDMK నాయకుడు విజయకాంత్ అనుసరించిన విధానాన్ని గుర్తు చేస్తుంది.
దీన్ని బట్టి చూస్తుంటే విజయ్ తన సేవా కార్యక్రమాల ద్వారా మరింతగా ప్రజల్లోకి దూసుకుపోతున్నాడనే చెప్పాలి. మరోవైపు విజయ్ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడం లేదనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే, విజయ్.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమాలో కనిపించనున్నాడు.