మహేష్-త్రివిక్రమ్ మూవీ కోసం..టాప్ స్టంట్ కొరియోగ్రాఫర్!

మహేష్-త్రివిక్రమ్ మూవీ కోసం..టాప్ స్టంట్ కొరియోగ్రాఫర్!

మహేష్ బాబు(Mahesh Babu)  హీరోగా త్రివిక్రమ్(Trivikram) డైరెక్షన్ లో రాబోతున్న మూవీ 'గుంటూరు కారం'. ఈ మూవీ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ఆసక్తి కలిగిస్తోంది. తాజాగా ఈ మూవీ కోసం కొత్త స్టంట్ కొరియోగ్రాఫర్ లను తీసుకున్నారట. ఇప్పటికే కేజీఎఫ్ మూవీలో చేసిన ఫైట్ మాస్టర్స్ ను మార్చి కొత్త వారిని తీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ను సెలెక్ట్ చేసుకున్నారని తెలుస్తోంది..ఇలా ఒక్కో ఫైట్ కు స్టంట్ మాస్టర్ ను సెలెక్ట్ చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.  కారణం ఏదైనా అయ్యిండొచ్చు..కానీ ఫైట్స్ విషయంలో మహేష్ - త్రివిక్రమ్ రాజీ పడటం లేదని అర్ధం చేసుకుంటున్నారు ఫ్యాన్స్. 

రీసెంట్ గా గుంటూరు కారం సెట్ లోకి టాప్ స్టంట్ కొరియోగ్రాఫర్ అనల్ అరసు( Anal Arasu) ని బరిలో దించారని తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్,  మణిరత్నం,- లింగుస్వామి-, మురుగదాస్ వంటి టాప్ డైరెక్టర్లతో పని చేసిన అనల్ అరసు దాదాపు 300 పైగా సినిమాలకు ఫైట్స్ ని కంపోజ్ చేసారు. త్రివిక్రమ్ విజన్ కు, మహేష్ దూకుడుకు అనిల్ అరసు వంటి స్టంట్ మాస్టర్ తోడవ్వడంతో ఇక ఫైట్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి. 

గతంలో మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా మూవీస్ లోని ఫైట్స్ తెరకెక్కించిన విధానం ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి. అందులో యాక్షన్ తో పాటుగా హుమరస్ యాంగిల్ తోడవ్వడంతో ప్రతి ఒక్కరు ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అయ్యారు. గుంటూరు కారం మూవీలో కూడా అలాంటి సెంటిమెంట్ టచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే కనుక వర్కౌట్ అయితే ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాల్సిందే. 

 ‘గుంటూరు కారం’ మూవీను  పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు త్రివిక్రమ్  తీసుకురాబోతున్నారు. జనవరి 13, 2024 సంక్రాంతి కానుకగా ఈ ‘గుంటూరు కారం’ థియేటర్లను ఘాటెక్కించబోతోంది.