
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ పట్టణం, మెదక్ రూరల్, కొల్చారం మండలాల్లో సోమవారం రాత్రి కుండపోత వాన కురిసింది. విడతల వారీగా రాత్రి 9 గంటల వరకు భారీ వర్షం కురిసింది. కొల్చారం మండలం పోతంశెట్పల్లి చౌరస్తాలో మెదక్ –- హైదరాబాద్ నేషనల్ హైవే మీద పెద్ద మొత్తంలో నీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. భారీ వర్షానికి మెదక్ పట్టణంలో రాందాస్ చౌరస్తాతో పాటు ఆయా వీధుల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి.