
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ జలాశయాల పరీవాహక ప్రాంతాల్లోని కాలువలు, చెరువులు పొంగుతున్నాయి. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసే భారీ వర్షాలకు ఈ జలాశయాలు ఫుల్ ట్యాంక్ లెవర్కు చేరుకుంటాయి. ఈసారి జూలైలోనే ఇంత పెద్దఎత్తున వరద రావడం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు.
మరో రెండు రోజులు ఇలాగే వర్షాలు పడితే జలాశయాలు పూర్తిగా నిండి, గేట్లు ఓపెన్‌చేసే అవకాశం ఉందన్నారు. ఉస్మాన్సాగర్ఫుల్ ట్యాంక్ లెవల్ 1790 అడుగులుకాగా, ప్రస్తుతం1783 అడుగులకు చేరింది. హిమాయత్సాగర్ఫుల్ట్యాంక్ లెవల్1763 అడుగులు కాగా, ప్రస్తుతం1760 అడుగుల నీరు ఉంది.