
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మ్యాచ్ కు సిద్ధమైంది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ తో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ టాస్ ఆలస్యం కానుంది. భారీ వర్షం కాకపోవడం ఊరట కలిగిస్తుంది. చిరు జల్లులు పడడంతో ప్రస్తుతం పిచ్ మీద కవర్స్ కప్పి ఉంచారు. దీంతో 7 గంటలకు పడాల్సిన టాస్ 7:20 లేదా 7:30 నిమిషాలకు వేసే అవకాశం ఉంది. 15 పాయింట్లతో పంజాబ్ కింగ్స్ మూడో స్థానంలో ఉండగా.. 13 పాయింట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదవ స్థానంలో ఉంది. ఇప్పటివరకు టోర్నమెంట్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి, మూడింటిలో ఓడిపోయింది, ఒక మ్యాచ్ ఫలితం లేకుండా పోయింది.
ALSO READ | IPLపై ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మే 11న జరగనున్న పంజాబ్, ముంబై మ్యాచ్ వేదిక మార్పు
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ ఢిల్లీని ఓడించగలిగితే, నాకౌట్ దశకు అర్హత సాధించిన మొదటి జట్టు అవుతుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి పంజాబ్ నాకౌట్ దశకు చేరుకుంటుందా లేక ఢిల్లీ విజయం సాధించి టేబుల్ లో తన స్థానాన్ని మెరుగు పరుచుకుంటుందా అన్నది ఈ సాయంత్రం తేలనుంది. మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. అప్పుడు పంజాబ్ ఖాతాలో 16.. ఢిల్లీ ఖాతాలో 14 పాయింట్లు చేరతాయి. ఆలా జరిగితే కేకేఆర్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.