V6 News

రైతులను ఇబ్బంది పెట్టొద్దు.. ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలి.. అప్పటి వరకు సిబ్బంది సెంటర్లలో ఉండాలి..

రైతులను ఇబ్బంది పెట్టొద్దు.. ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలి.. అప్పటి వరకు సిబ్బంది సెంటర్లలో ఉండాలి..
  • రైతులకు ఇబ్బందుల్లేకుండా కొనుగోళ్లు చేపట్టాలి: సిద్ధిపేట జిల్లా కలెక్టర్​
  • నారాయణరావుపేట మండలం కొనుగోలు సెంటర్లు కలెక్టర్​ కె. హైమవతి తనిఖి

సిద్దిపేట రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వడ్ల కొనుగోళ్లు జరపాలని సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి అన్నారు. సోమవారం సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు, రాఘవపూర్, నారాయణరావుపేట మండలం బంజేరుపల్లి గ్రామాల్లో వడ్ల కొనుగోలు సెంటర్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు పూర్తయ్యేదాకా సిబ్బంది సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉండాలని, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.