పుస్తకాల్లో కఠిన పదాలు..అర్థమైతలేదన్న విద్యార్థులు

పుస్తకాల్లో కఠిన పదాలు..అర్థమైతలేదన్న విద్యార్థులు

‘‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం’ల కోసం జరిగిన ఉద్యమాలు ఉమ్మడి ప్రజా కార్యాచరణకు దారులు చూపాయి..’’

‘‘భావనలు, ఉద్వేగాల కంటే హేతువు, శాస్ర్త, సాంకేతిక విజ్ఞానాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం, పెద్దఎత్తున పారిశ్రామీకరణ అచ్చెరువుగొలిపే ప్రభావంతోపాటు శ్రామిక ప్రజల దారిద్ర్యం, దుర్భర జీవనాలు మేధావులపైనా గాఢ ముద్రను వేశాయి.’’

ఇదేదో గ్రాంథికం అనుకునేరు.. మన రాష్ట్రంలో స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రింటైన భాష. 9వ తరగతి సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టడీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కొన్ని సెంటెన్స్‌లు ఇవి. ఇంత కఠినమైన భాష పిల్లలకు ఎలా అర్థమవుతుందో లెసన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారు చేసిన ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఈఆర్టీ ఆఫీసర్లే చెప్పాలి. ఒక్క సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే కాదు.. మిగతా సబ్జెక్టు బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఇదే భాష. కొన్ని సెంటెన్స్‌లు కూడా అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.

 ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరిగా చేయక..

పుస్తకాల్లోని ప్రతి విషయం స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్థమయ్యేలా సులభభాషలో ఉండాలి. కానీ అర్థంకాని రీతిలో కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఈఆర్టీ రచయితలు తయారుచేశారు. కొన్ని వ్యాఖ్య నిర్మాణాలు పూర్తిగా అర్థాన్ని మార్చేవిధంగా ఉన్నాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ పాఠ్య పుస్తకాలను 2011లో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఈఆర్టీ కొత్త కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తీసుకొచ్చింది. తెలంగాణ వచ్చాక 2016లో తెలుగు, సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుస్తకాల్లో మార్పులు చేశారు. అయితే ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియంలోని సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తెలుగులోకి సరైన పద్ధతిలో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయకపోవడంతో సెంటెన్స్‌లు  కుదర్లేదు. ‘‘ప్రకృతి వనరులు, ఆస్తులు వ్యక్తుల కింద వారి నియంత్రణలో కాకుండా ప్రజల ఆధీనంలో ఉండాలనే సిద్ధాంతం’’ అని సామ్యవాదం గురించి చెప్పారు. మరో పేజీలో ఓ అంశాన్ని వివరిస్తూ.. ‘‘పారిశ్రామికీకరణ పారిశ్రామిక పెట్టుబడిదారులకు, బడా భూస్వాములకు అధికారం, ప్రాబల్యంతోపాటు సంఘటిత కార్మికవర్గ ఉద్యమాలకు దారి తీసింది.’’ అని ఉంది. ఇవి స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే కాదు..  టీచర్లకూ అర్థం కావడం లేదు. దీన్ని సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పే వీలున్నా ఆ ప్రయత్నం చేయలేదు. డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగే తప్పొప్పుల దిద్దుబాటు కార్యక్రమం (ఎరటా)లో ఇలాంటి అర్థంగానీ భాషను తీసేసి, అందరికీ అర్థమయ్యే భాషను చేర్చాలని టీచర్లు, స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోరుతున్నారు.