తెలంగాణలో కస్టమైస్డ్ టూరిజం : ఎండీ వల్లూరు క్రాంతి

తెలంగాణలో కస్టమైస్డ్ టూరిజం : ఎండీ వల్లూరు క్రాంతి
  • బ్యాంకాక్ లో పాటా ట్రావెల్ మార్ట్ లో తెలంగాణ స్టాల్స్ 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు వచ్చే టూరిస్టులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, పేద, ధనిక తేడా లేకుండా కస్టమైజ్డ్ టూరిజం సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. బుధవారం బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న పాటా ట్రావెల్ మార్ట్ కార్యక్రమంలో తెలంగాణ స్టాల్​ను లాంఛనంగా ప్రారంభించారు. థాయిలాండ్ లోని ఇండియన్ అంబాసిడర్ నగేశ్ సింగ్ రిబ్బన్ కట్ జ్యోతి ప్రజ్వలన చేశారు. 

అనంతరం టూరిస్టులను ఎలా ఆకర్షించాలనే అంశంపై టూరిజం కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతి ఆయనతో చర్చించారు. తెలంగాణకు వచ్చే టూరిస్టులకు ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీసులు భద్రత కల్పిస్తున్నారన్నారు. ఇక్కడ పర్యాటకులకు బస్సులు, హోటళ్లు వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 

థాయిలాండ్ మీడియాతో పాటు అనేక అంతర్జాతీయ ట్రావెల్ ఏజెన్సీలతో కలిసి తెలంగాణ చరిత్రను పరిచయం చేసినట్లు చెప్పారు.  పాటా ట్రావెల్ మార్ట్ లో బుద్ధిస్ట్ టూరిజం, కల్చరల్ టూరిజం, తెలంగాణ చేనేత, హస్తకళలను ప్రదర్శించారు. కార్యక్రమంలో టీజీ టీడీసీ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ ఉపేందర్ రెడ్డి, టూరిజం పీఎంయూ దిల్లీశ్వరి, అసిస్టెంట్ డైరెక్టర్ ఓం ప్రకాశ్ తదితరులు పాలొన్నారు.