శ్రీశైలం ఘాట్​ రోడ్డుపై ట్రాఫిక్ జామ్

శ్రీశైలం ఘాట్​ రోడ్డుపై ట్రాఫిక్ జామ్

శ్రీశైలం, అమ్రాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  ప్రాజెక్టుల గేట్లు తెరవడం, వరుస సెలవులు రావడంతో జనాలు క్యూ కడుతున్నారు. దీంతో ఎక్కడ చూసినా ప్రాజెక్టులు సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్​, జూరాల ఇలా అన్నిచోట్లా సందడి కనిపిస్తోంది. ఆదివారం శ్రీశైలం అందాలను చూడడానికి టూరిస్టులు పోటెత్తడంతో డ్యాం ఘాట్ రోడ్డు వాహనాలతో నిండిపోయింది. దాదాపు 10 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు గంటల పాటు శ్రమించి ట్రాఫిక్ ను క్లియర్ ​చేశారు.  

కొనసాగుతున్న వరద

ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. 3, 92, 575 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో 10 క్రస్ట్ గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ కెపాసిటీ 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.40 అడుగులకు చేరుకుంది.

జూరాలలో..

గద్వాల : జూరాల ప్రాజెక్టు కెపాసిటీ 9.657 టీఎంసీలు కాగా... 4,245 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకొని 38 గేట్లు ఓపెన్ చేసి 2,86,119 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 2.77 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌‌‌‌‌‌‌ ఫ్లో వస్తోంది. జూరాల పైన ఉండే నారాయణపూర్ డ్యామ్‌‌‌‌‌‌‌‌లో 27.01 టీఎంసీల నీరు నిల్వ ఉంచుకొని 24 గేట్లను ఓపెన్ చేసి 2.13 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 2.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో ఉంది. 

నాగార్జున సాగర్​లోనూ పర్యాటకుల సందడి

హాలియా:  సాగర్​ ప్రాజెక్టు 26 గేట్ల నుంచి దూకుతున్న నీటి అందాలను తిలకించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. డ్యాం పరిసరాలు, పవర్ ప్రాజెక్టు, అనుపు, విజయవిహార్, బుద్ధవనాన్ని చూసి పోతున్నారు. శ్రీశైలం నుంచి 3,13,379 క్యూసెక్కులు వస్తుండడంతో ప్రాజెక్ట్ 26  క్రస్టు గేట్లను 10 ఫీట్లు ఎత్తు 2,93,446 క్యూసెక్కులను కిందికి వదిలారు. సాగర్ పూర్తి కెపాసిటీ 590 అడుగులు కాగా, 584.90 అడుగుల నీళ్లున్నాయి. ఎడమ కాలువకు 8629, కుడికాల్వకు 8629 , ఎస్ఎల్​బీసీకి 2400, వరదకాల్వకు 300 , మెయిన్ పవర్ హౌస్ ద్వారా 33,130  క్యూసెక్కులు వదులుతున్నారు.