బొగత జలపాతాలకు తొలకరి జలకల .. ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు

బొగత జలపాతాలకు తొలకరి జలకల .. ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు

తెలంగాణ నయాగరా జలపాతాలుగా పేరుగాంచిన బొగత జలపాతాలు సరికొత్త కళ సంతరించుకుంది.  తొలకరి వరద నీటితో  జలపాతాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది.  దీంతో జనాలు  జలపాతాల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో చత్తీస్ఘడ్ లో కురుస్తున్న వర్షాలతో బోగత జలపాతాలకు నీరు వస్తుంది. 

50 అడుగులు ఎత్తునుండి పాలధారలా జాలువరుతున్న జలపాతాలను వీక్షించేందుకు జనం పరుగులు పెడుతున్నారు. జలపాతాలలో జలకాలాడుతూ తనివితీరా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాది సరైన వర్షాలు  లేకపోవడంతో కాస్త ఆలస్యంగా జలపాతల కళ సంతరించుకుంది. ఈ ఆదివారం సందర్శకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 

బొగత వాటర్‌ఫాల్స్ చీకులపల్లి ఫాల్స్ అనికూడా అంటారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీప్రాంతంలో బొగత జలపాతం ఉంది. కాళేశ్వరం-భద్రాచలం అడవుల మధ్యన ఇది ఉన్నది. 30 అడుగుల ఎత్తు నుంచి వాగు నీళ్లు దుంకి కింద పెద్ద జలాశయంగా ఏర్పడుతాయి. పచ్చని దట్టమైన అడవుల మధ్య కొండకోనల్లో నుంచి హోరెత్తే నీటి హొయల నిండైన జలపాతం బొగత. ప్రకృతి సృష్టించిన అద్భుతమైన అందాల్లో ఇది ఒకటి.