
ములుగు జిల్లా రామప్ప టెంపుల్, జయశంకర్ జిల్లా రేగొండ మండలం పాండవుల గుట్టల్లో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రామప్పలో స్వామివారిని దర్శించుకుని, ఆలయ చరిత్రను తెలుసుకుని, లేక్‌లో బోటింగ్ చేశారు. ఎస్సై చల్ల రాజు బోటింగ్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
కాగా, పాండవులగుట్టల్లో వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్ క్యాంప్ నిర్వహించారు. రాతి చిత్రాలు, ఆనవాళ్లు, గుట్టలపై శిలలను గురించి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రొఫెసర్ పాండురంగారావు విద్యార్థులకు వివరించారు.– వెంకటాపూర్(రామప్ప)/ జయశంకర్భూపాలపల్లి, వెలుగు