మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ (Tovino Thomas) రియలిస్టిక్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ తో ప్రేక్షకులకు సుపరిచితం. మలయాళ డబ్బింగ్ మూవీ స్ అయినా ‘మిన్నల్ మురళి’, 2018, అన్వేషిప్పిన్ కండేతుమ్, ఆర్మ్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
ఇప్పుడాయన నుంచి రానున్న పాన్ ఇండియా సినిమా ‘పల్లి చట్టంబి’. కయాదు లోహర్ హీరోయిన్. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు డీజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్నారు. నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో టొవినో మాస్ లుక్‌లో ఫెరోషియస్‌గా కనిపిస్తున్నాడు. 2026 ఏప్రిల్ 9న సినిమాను విడుదల చేయబోతున్నట్టు తెలియజేశారు. మలయాళంతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఇదే తేదీకి రాబోతోందని ప్రకటించారు. యాభై, అరవై దశకాల నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో మునుపెన్నడూ కనిపించనంత కొత్తగా టొవినో థామస్‌ను చూపించబోతున్నట్టు మేకర్స్ ఈ సందర్భంగా తెలిపారు.
