ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బల్దియా ఆఫీసుల్లో నామినేషన్ల కోలాహలం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బల్దియా ఆఫీసుల్లో నామినేషన్ల  కోలాహలం
  • ఎన్వోసీలు, నామినేషన్ పత్రాల కోసం బారులు తీరినఅభ్యర్థులు, వారి అనుచరులు 
  • పలు చోట్ల అధికారులతో వాగ్వాదం

కరీంనగర్, వెలుగు:  ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలోని పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. మొదటి రోజే మున్సిపల్ ఆఫీసులకు అభ్యర్థులు, వారి అనుచరులు పోటెత్తారు. నామినేషన్ పత్రాలతోపాటు ఇంటిపన్ను, నల్లా పన్నుకు సంబంధించి నోఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్వోసీ) కోసం కౌంటర్ల వద్ద బారులుదీరారు. ట్యాక్స్ బకాయి ఉన్న అభ్యర్థులు, వారి ప్రతిపాదకులు అప్పటికప్పుడు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెల్లించారు. ఎన్వోసీల కోసం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చింది. సర్టిఫికెట్ల  జారీలో జాప్యం చేస్తుండడంతో ఆఫీసర్లతో కొందరు అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు. 

సిరిసిల్ల మున్సిపాలిటీలో అభ్యర్థులను, వారి అనుచరులను గేటు బయటే నిలిపివేశారు. రోడ్డు మీదే క్యూ కట్టించడంతో అసహనానికి లోనయ్యారు. మొదటిరోజు చాలా మంది అభ్యర్థులకు నామినేషన్ వేసేందుకు అవసరమైన పత్రాలను సమకూర్చుకోవడంతోనే సరిపోయింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుధవారం  అత్యధికంగా 76, జగిత్యాల మున్సిపాలిటీలో 21, సిరిసిల్లలో 20 నామినేషన్లు దాఖలయ్యాయి. మిగతా చోట్ల 20 లోపే నామినేషన్లు వచ్చాయి. గురు, శుక్రవారాల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. 

టికెట్​ కన్ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాకపోయినా నామినేషన్లు.. 

ఉమ్మడి జిల్లాలోని ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో  కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల పేర్లు ఇంకా ఖరారు కాలేదు. అయినప్పటికీ  తర్వాత పార్టీ బీఫామ్ సమర్పించవచ్చనే  ధీమాతో చాలా మంది పార్టీ అభ్యర్థులుగానే నామినేషన్లు దాఖలు చేశారు.  సీపీఐ, సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి తోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు.  

మరోవైపు కొందరు పార్టీ టికెట్ల కోసం తమ లీడర్ల ఇళ్ల దగ్గర క్యూ కట్టారు. జిల్లా కలెక్టర్ల పరిశీలన కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జమ్మికుంట, హుజూరాబాద్ లోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు.  ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, ఎన్నికల విధుల పట్ల అప్రమత్తంగా  వ్యవహరించాలని సిబ్బందిని ఆదేశించారు. చొప్పదండి మున్సిపాలిటీలో నామినేషన్లల స్వీకరణ ప్రక్రియను  జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పరిశీలించారు. 

బల్దియా       డివిజన్లు/వార్డులు    నామినేషన్లు
కరీంనగర్                66                                76
రామగుండం          60                                 13
చొప్పదండి            14                                 10
హుజూరాబాద్        30                                 15
జమ్మికుంట           30                                  11 
జగిత్యాల                50                                   21
ధర్మపురి                15                                  10
కోరుట్ల                    33                                    7
మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి               26                                   17 
రాయికల్             12                                      9
సిరిసిల్ల                39                                     20
వేములవాడ        28                                     16 
సుల్తానాబాద్     15                                      24
పెద్దపల్లి             36                                      52
మంథని            13                                       13