కవిత చెప్పిందే నిజం.. మైనారిటీకి మంత్రి పదవి ఇస్తమంటే బీజేపీ అడ్డుకుంటుంది: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

కవిత చెప్పిందే నిజం.. మైనారిటీకి మంత్రి పదవి ఇస్తమంటే బీజేపీ అడ్డుకుంటుంది: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

హైదరాబాద్: ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇస్తామంటే బీజేపీ అడ్డుకుంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్‎ను గెలిపించాలనే లోపాయికారీ ఒప్పందంలో భాగంగా బీజేపీ రాజకీయాలు చేస్తోందని అన్నారు. ఎమ్మెల్సీ కవిత చెప్పినట్లుగా బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అజారుద్దీన్‎కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. 

ఈ సందర్భంగా గురువారం (అక్టోబర్ 30) మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. క్రీడాకారుడిగా, రాజకీయ నేతగా అజారుద్దీన్ ప్రజలకు సేవలదించారని అన్నారు. ఈ క్రమంలోనే అజారుద్దీన్‎కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించామని తెలిపారు. ఇప్పుడు మైనార్టీకి మంత్రి పదవి ఇస్తామంటే బీజేపీ అడ్డుకుంటుందని.. మైనార్టీని మంత్రిని చేస్తున్నారనే అక్కసుతో బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. 

►ALSO READ | BRS తప్పుడు ప్రచారం చేస్తోంది.. పార్టీ మార్పు వార్తలపై రాజగోపాల్ రెడ్డి క్లారిటీ

బీజేపీ పాలిత రాజస్థాన్‎లో 20 రోజుల్లో ఎలక్షన్ ఉందనగా సురేంద్ర పాల్‎ను మంత్రి చేశారని.. మరీ పోటీలో ఉన్న వ్యక్తిని మంత్రిని ఎలా చేశారని ప్రశ్నించారు. మంత్రిని చేసినా సురేంద్ర పాల్ ఎన్నికల్లో ఓడిపోయారని గుర్తు చేశారు. మరీ పోటీలో లేని అజారుద్దీన్‎ను మంత్రిని చేస్తే తప్పయిందా..? అని నిలదీశారు. బీజేపీ ద్వంద వైఖరి అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‎లో బీఆర్ఎస్‎ను గెలిపించడానికి బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు.