BRS తప్పుడు ప్రచారం చేస్తోంది.. పార్టీ మార్పు వార్తలపై రాజగోపాల్ రెడ్డి క్లారిటీ

BRS తప్పుడు ప్రచారం చేస్తోంది.. పార్టీ మార్పు వార్తలపై రాజగోపాల్ రెడ్డి క్లారిటీ

హైదరాబాద్: పార్టీ మార్పు వార్తలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారుతున్నానని బీఆర్ఎస్ తనపై దుష్ప్రచారం చేస్తుందని.. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ఆయన కోరారు. బీఆర్ఎస్‎తో పాటు సొంత పార్టీ వాళ్లు కూడా పార్టీ మారుతున్నానని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 

ప్రజలు దుష్ప్రచారాలను నమ్మొద్దని.. నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను సీన్సియారిటీ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తనని.. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే పని చేస్తానని తెలిపారు. నా ముందు మునుగోడు నియోజకవర్గ అభివృద్ది తప్ప.. మరో ఆలోచన లేదని పేర్కొన్నారు. గురువారం (అక్టోబర్ 30) చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని చెరువులను పరిశీలించి గంగ పూజ నిర్వహించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 

►ALSO READ | 122 సంవత్సరాల తర్వాత.. హన్మకొండలో భూమి బద్దలయ్యే రేంజ్లో వర్షం పడింది..!

అనంతరం చౌటుప్పల్ మున్సిపాలిటీలోని చెరువు నిండినప్పుడు కాలనీలు జలమయం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చౌటుప్పల్ మున్సిపాలిటీ డెవలప్మెంట్‎కు 500 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపూదిద్దబోతుందని తెలిపారు. చౌటుప్పల్ చెరువు నుండి ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తుగా ప్రణాళికలు వేసి దండు మల్కాపురం, లక్కారం  వద్ద వరద నీటిని డైవర్ట్ చేయడంతో మున్సిపాలిటీ ప్రజలకు వరద ముప్పు తప్పిందన్నారు.