ఎన్నికలయ్యే వరకు లిక్కర్ బ్యాన్ చేయండి : ఈసీకి రిక్వెస్ట్

ఎన్నికలయ్యే వరకు లిక్కర్ బ్యాన్ చేయండి : ఈసీకి రిక్వెస్ట్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం రోజు నుంచి.. పోలింగ్ ముగిసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా మందు.. అదేనండీ లిక్కర్ బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఎన్నికల సంఘాన్ని కోరారు కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. ఈ మేరకు అక్టోబర్ 25వ తేదీన ఈసీని కోరారు. బీఆర్ఎస్ పార్టీ లిక్కర్ తో ఓటర్లను ప్రభావితం చేస్తుందని.. పోలింగ్ పూర్తయ్యే వరకు మందును బ్యాన్ చేయాలని కోరారు.

అంతే కాకుండా.. అధికార బీఆర్ఎస్ పార్టీ.. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను.. పార్టీ కార్యకలాపాలకు ఉపయోగించుకుంటూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ ఈసీకి కంప్లయింట్ చేశారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రచార హోర్డింగ్స్ ను అధికార బీఆర్ఎస్ పార్టీకే ఇస్తు్న్నారని.. మిగతా పార్టీలకు ఇవ్వటం లేదని.. ఈ విషయాన్ని పరిశీలించాలని కోరారాయన. 

కాంగ్రెస్ పార్టీ తరపున చేసిన ఈ కంప్లయింట్స్ పై ఈసీ పరిశీలించిన నిర్ణయం తీసుకుంటుందని.. హామీ ఇచ్చినట్లు తెలిపారు రేవంత్ రెడ్డి. నామినేషన్లు ప్రారంభం నుంచి పోలింగ్ ముగిసే వరకు మందు బ్యాన్ చేయాలని.. వైన్ షాపులు మూసివేయాలని డిమాండ్ చేయటం అనేది ఆసక్తిగా మారింది. దీనిపై ఈసీ నిర్ణయం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్..