ధరణి పోర్టల్ సమస్యలపై రేవంత్ ఫైర్
V6 Velugu Posted on Jan 20, 2022
హైదరాబాద్: ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చి ఏడాది దాటిన సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ధరణి పోర్టల్ కొత్త సమస్యలకు నెలవుగా మారిందని ఫైర్ అయ్యారు. నిర్వహణ లోపమా లేదా భారీ భూ కుంభకోణమా తేలాల్సిన అవసరం ఉందన్నారు. ‘నిముషాల వ్యవధిలో భూముల రిజిస్ట్రేషన్ అని ఆర్భాటంగా ప్రకటించిన ధరణి.. కొత్త సమస్యలకు నెలవుగా మారింది. భూమే ప్రాణంగా బతికే రైతు ఆ భూ హక్కు కోసం నెలల తరబడి అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సిన దుస్థితి వచ్చింది. ఇది నిర్వహణ లోపమా! భారీ భూ కుంభకోణమా!? తేలాల్సిన అవసరం ఉంది’ అని రేవంత్ డిమాండ్ చేశారు.
నిముషాల వ్యవధి లో భూముల రిజిస్ట్రేషన్ అని ఆర్భాటంగా ప్రకటించిన ధరణి… కొత్త సమస్యలకు నెలవుగా మారింది. భూమే ప్రాణంగా బతికే రైతు ఆ భూ హక్కు కోసం నెలల తరబడి అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సిన దుస్థితి వచ్చింది. ఇది నిర్వహణ లోపమా! భారీ భూ కుంభకోణమా!? తేలాల్సిన అవసరం ఉంది. pic.twitter.com/Z3njeIXbBa
— Revanth Reddy (@revanth_anumula) January 20, 2022
ఇకపోతే, భూరికార్డుల ఎంట్రీలో రెవెన్యూ అధికారులు చేసిన తప్పులు రైతులను వెంటాడుతున్నాయి. భూమి ఉండి, కాస్తులో ఉన్నా కొందరికి పాస్ బుక్స్ రాలేదు. మరికొందరికి భూమి లేకపోయినా పాస్ బుక్స్ వచ్చాయి. కొన్ని చోట్ల భూమి ఉండి, కొత్త పాస్ బుక్స్ కలిగి ఉన్నా ధరణి పోర్టల్ లో చూస్తే ఆ వివరాలు కనిపించట్లేదు. సమస్యలు పరిష్కరిచాంటూ రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.
మరిన్ని వార్తల కోసం:
ఎన్నికలు వస్తేనే ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తుకొస్తయా?
కాంగ్రెస్ను వీడిన మరో ఎమ్మెల్యే
ఎమ్మెల్యేను తరిమికొట్టిన గ్రామస్థులు
Tagged Telangana, Revanth reddy, Dharani portal, KCR government, land registrations